India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లా అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు మద్దసాని ప్రకాశం కుమార్తె అమూల్యకు 2017లో వివాహం జరిగింది. శ్రీకాంత్ HYD గచ్చిబౌలిలో హాస్టల్ నడుపుతున్నాడు. అయితే ఆన్‌లైన్ గేమింగ్‌తో పాటు పలు వ్యసనాల వల్ల భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. బామ్మర్ది యశ్వంత్‌ని చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందని భావించాడు. తన స్నేహితుడు ఆనంద్, వెంకటేశ్‌తో కలిసి యశ్వంత్‌ను చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు.

రాపూరు మండలం పెంచలకోనలో స్వయంభుగా వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం నుంచి బుధవారం వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి విజయసాగర్ బాబు తెలిపారు. మూడురోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, హోమములు, అభిషేకము, బుధవారం మహా పూర్ణాహుతి, మహా కుంభ ప్రోక్షణ జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

తిరుపతిలోని సినిమా థియేటర్‌లో ఎంబీయూ యూనివర్శిటీ విద్యార్థి లోకేశ్‌పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం కార్తీక్‌తో పాటు మరో యువతి కావ్య పరారయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక్, కావ్యది సూళ్లూరు పేట కాగా, బాధితుడిది ప్రకాశం జిల్లా గిద్దలూరుగా గుర్తించారు.

మాజీ సీఎం జగన్‌కి సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయవాడకు వచ్చిన వరదలపై జగన్ విమర్శిస్తున్న తీరును తప్పుబట్టారు. విపత్తులు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు దిట్ట అయితే , రూ. లక్షల కోట్లు దాచుకోవడంలో జగన్ రోల్ మోడల్ అని ఎద్దేవా చేశారు. జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణాభివృద్ధి అధికారి సి. విజయవినీల్ కుమార్ తెలిపారు. కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ, కోవూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ , ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో ఉదయం 9.30 – 2 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. 10,ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటిఐ చేసిన వారు అర్హులు.

సూళ్లూరుపేట పట్టణంలో శుక్రవారం ట్యూషన్ కోసమని ఇంటి నుంచి వెళ్లి ఆఫ్రీన్(12) మిస్సైన సంగతి తెలిసిందే. అయితే బాలిక ప్రస్తుతం చెన్నై పోలీసుల చెంత సురక్షితంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పాప చెన్నైకి వెళ్లి ఓ ఆటో ఎక్కి తనను బీచ్ వద్దకు చేర్చమని ఆటో వ్యక్తికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు కుటుంబీకులు సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు.

నెల్లూరు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో జరిగిన ఆక్రమ రిజిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. కార్పొరేషన్ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన జాఫర్, మిల్కిరోషన్, సింహాద్రిలను సస్పెండ్ చేసినట్లు డీఐజీ కిరణకుమార్ తెలిపారు.

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ఎస్పీ జి.కృష్ణ కాంత్ తెలిపారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 36 మంది పోలీసులు వారి యొక్క సమస్యల గురించి తెలుసుకున్నారు. ట్రాన్స్ ఫర్లు, రిక్వెస్ట్‌లు, మెడికల్ సమస్యలు వంటి సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.

సంగం బ్యారేజ్ కి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో పెట్టిన పేరును కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక తొలగింపు చర్యలకు శ్రీకారం చుట్టింది. తాజాగా శుక్రవారం బ్యారేజ్ వద్ద బోర్డుపై ఏర్పాటు చేసిన మేకపాటి గౌతం రెడ్డి పేరును వైట్ వాస్ వేసి తొలగించారు. దీంతో పలువురు వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో పెట్టిన పేర్లను తొలగించాలని కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల సీసీ, ఎమ్మెస్ సీసీలకు డీఆర్డీఏ పీడీ సాంబశివా రెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించారు. ముందుగా 5 సంవత్సరాలు ఒకే మండలంలో పనిచేసిన సిబ్బందికి నియోజకవర్గం వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయించారు. మధ్యాహ్నం రిక్వెస్ట్ పెట్టిన ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.