Nellore

News March 27, 2024

ఆనం వివాదాస్పద ట్వీట్

image

సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి బుధవారం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈక్రమంలో విజయమ్మ సీఎం జగన్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. సంబంధిత ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వివాదాస్పదంగా స్పందించారు. ‘చెల్లిని ఏమీ చేయవద్దు’ అనే క్యాప్షన్‌తో ఆ ఫొటోను ట్వీట్ చేశారు.

News March 27, 2024

గూడూరు-వెంకటగిరి రోడ్డుపై ప్రమాదం 

image

గూడూరు-వెంకటగిరి రోడ్డుపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి గూడూరు వైపు వస్తున్న కారు.. ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.    

News March 27, 2024

నెల్లూరు MP అభ్యర్థిగా భాస్కర్ గౌడ్ పోటీ

image

రాష్ట్రంలోని ఐదు పార్లమెంటు స్థానాలకు BSP అధిష్ఠానం తమ అభ్యర్థులను ప్రకటించింది. అందులో నెల్లూరు MP అభ్యర్థిగా గూడూరుకు చెందిన బీఎస్పీ నాయకుడు భాస్కర్ గౌడ్‌ను, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లికార్జున్‌ను ఎంపిక చేసింది. 50 అసెంబ్లీ స్థానాలకు BSP  తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 

News March 27, 2024

సూళ్లూరుపేట గోకులకృష్ణ కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం

image

సూళ్లూరుపేట సమీపంలోని గోకులకృష్ణ కాలేజీ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డిపో నుంచి సూళ్లూరుపేటకు వెళ్తూ గోకుల్ కృష్ణ కాలేజీ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవ్వరికి ప్రాణ నష్టం జరగలేదు.

News March 27, 2024

నెల్లూరు: కరోనా నాటు మందు సృష్టికర్త ఆనందయ్య టీడీపీలో చేరిక

image

ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కరోనా నాటు మందు సృష్టికర్త బోనిగి ఆనందయ్య మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు అతని అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ఆనందయ్య వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు. ఆనందయ్య టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

News March 27, 2024

జిల్లాలో సీనియర్ అభ్యర్థి ఆయనే

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. వీరితో పాటు సీనియర్ నాయకులూ పోటీ పడబోతున్నారు. వీరందరిలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన 1983లోనే తొలిసారి నెల్లూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.

News March 27, 2024

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవసేనమ్మ?

image

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వచ్ఛ ఆంధ్ర ఛైర్‌‌పర్సన్ పి.దేవసేనమ్మ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకటగిరి సీటును నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగా ఆయనపై అసమ్మతి వర్గం దండెత్తడంతో ఆయన పేరు మార్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అధిష్ఠానం నుంచి దేవసేనమ్మకు పిలుపు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

News March 27, 2024

REWIND.. నెల్లూరులో ‘ఉదయించిన సూర్యుడు’

image

నెల్లూరు నియోజకవర్గంలో 1989 ఎన్నికల్లో జక్కా కోదండరామి రెడ్డి(జేకే రెడ్డి) సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగగా ఎన్నికల కమిషన్ ఉదయించే సూర్యుడు గుర్తు కేటాయించింది. ఆ ఎన్నికల్లో ప్రచారాన్ని జేకే రెడ్డి సరికొత్త పుంతలు తొక్కించారు. అందరి మనస్సు చూరగొని తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి తాళ్లపాక రమేష్ రెడ్డిపై 14474 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

News March 27, 2024

కావలిలో దారుణం ..హత్య చేసి.. ఇంటి వద్దే పూడ్చి..

image

కావలి రూరల్ మండలం పెద్దరాముడుపాళెంలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 19న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పని ఉందని కాటంగారి చిన్నగోపాల్(27)ను తీసుకెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాలు, కుటుంబ సభ్యుల వద్ద ఆరాతీశారు. గోపాల్‌ను తీసుకెళ్లిన వ్యక్తి తన ఇంటి వెనకే పూడ్చినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కావలి రూరల్ సీఐ శ్రీనివాస గౌడ్ విచారణ చేపట్టారు.

News March 27, 2024

సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి: SFI

image

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హర్ష కోరారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రామచంద్రా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసి 90 రోజుల తరువాతే పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరేంద్ర, చరణ్ తదితరులు ఉన్నారు.