India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు ప్రజలు ఎంతో ఆనందంగా భాగస్వాములయ్యే రంగడి తేరు (శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం) బుధవారం జరగనుంది. ఉదయం 8.30 గంటలకు సర్వాలంకార శోభితులైన దేవేరుల సమేత రంగనాథుడు విశేషంగా అలంకరించిన రథంలో కొలువుదీరుతారు. అనంతరం గోపురం వీధిలో రైల్వే గేటు వరకు తిరిగి ఆలయం మీదుగా సంతపేట నాలుగు కాళ్ల మండపం వరకు రథోత్సవం సాగనుంది. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
ఉదయగిరిలో 1994 ఎన్నికల ప్రత్యేకతే వేరు. కంభం విజయరామి రెడ్డి టీడీపీ సీటు రేసులో ఉండగా అనూహ్యంగా కొండపల్లి గురవయ్య నాయుడు బీఫామ్ దక్కించుకున్నారు. చివరిలో మళ్లీ టీడీపీ అధిష్ఠానం కంభంకే మద్దతు పలికింది. అప్పటికే సమయం మించడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎద్దుల బండి గుర్తుతో పోటీ చేశారు. 61 శాతం ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికై కంభం సంచలనం సృష్టించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మాదాల జానకిరాం నిలిచారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఉదయగిరి పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు 26 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు ఏర్పాటు చేసి ఇప్పటికే తనిఖీలు చేపట్టామన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు పార్టీలోని అసమ్మతి నేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీలో రాంకుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తూ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు టీడీపీలో సీటు దక్కలేదని కీలక నేత మస్తాన్ యాదవ్ ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు.
గూడూరు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. YCPని వీడి BJPలో చేరిన గూడూరు MLA వరప్రసాద్‌కు ఆ పార్టీ తిరుపతి టికెట్ కేటాయించింది. ఈక్రమంలో తొలిసారిగా గూడూరుకి వచ్చిన ఆయనకు TDP, జనసేన, BJP శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పొత్తులో భాగంగా గూడూరు నుంచి పాశం సునీల్, తిరుపతి MP అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రత్యర్థులుగా తలపడిన వీళ్లు ఇప్పుడు ఒకే కూటమి కింద ఒకరికొకరు ప్రచారం చేసుకుంటున్నారు.
వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో వెనుకబడిన తరగతుల వారిపై చూపిన వివక్ష కారణంగా టీడీపీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
HYDలో నెల్లూరు జిల్లా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కందుకూరు(M) పందలపాడుకు చెందిన కిరణ్ కుమార్(26) HYD వనస్థలిపురంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సోమవారం గదిలోకి వెళ్లిన అతడు ఎంతకూ బయటకు రాలేదు. యజమాని కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, నెల్లూరులో సీనియర్ రాజకీయ నాయకుడైన మున్వర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన కొంతకాలం క్రితం వైసీపీలో చేరారు. మున్వర్ హఠాన్మరణం చెందడంపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు ఆయన అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నెల్లూరులోని ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.
కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజకీయ వ్యవహారాలలో ఆమె కుమారుడు డాక్టర్ అర్జున్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. నెల్లూరులోనే మకాం వేసి పాత పరిచయాలు, బంధుత్వాలను సమన్వయం చేసుకుంటూ పలువురు నేతలను వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెంలో సోమవారం జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గ్రామానికి చెందిన వాలంటీరు పెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా భావిస్తూ స్థానిక పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నివేదిక మేరకు ఎంపీడీవో రామాంజనేయులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రంగనాథ్ గౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.