India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కావలికి చెందిన పనబాక లక్ష్మి నెల్లూరులో మూడు సార్లు, బాపట్లలో ఒకసారి MPగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పని చేసిన ఆమె రాష్ట్ర విభజన తర్వాత TDPలో చేరారు. 2019, 2021లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆమె తిరుపతి, బాపట్లలో ఏదో ఒక స్థానం నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. ఆ రెండు చోట్ల చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. దీన్ని ఆమె ఖండించారు.
మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఇటీవల విష్ణుతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. ఇవాళ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. విష్ణు మాత్రం పోటీలో ఉంటానంటూ ప్రచారంలో దూసుకెళుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 27న నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన పర్యటన సాగనుంది. ఈ మేరకు సమాచారం రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.
నెల్లూరు నేతలు ఎక్కడైనా నెగ్గుకొస్తారనే పేరుంది. గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నరసారావుపేట, విశాఖ, బాపట్ల MPగా, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒంగోలు, నరసారావుపేట MPగా, పనబాక లక్ష్మి బాపట్ల MPగా విజయం సాధించారు. ఒంగోలు ఎంపీగా గతంలో బెజవాడ పాపిరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మ, ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఈఎన్నికల్లో నరసారావుపేట నుంచి పోటీ చేస్తున్న అనిల్ అదృష్టం ఎలా ఉందో.
ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెలలోనే ఈ ప్రయోగం చేపట్టాల్సివుంది . అయితే ఉపగ్రహ రాడార్ యాంటెన్నా రిఫ్లెక్టర్ కు అదనపు పూత అవసరమని శాస్త్రవేత్తలు భావించడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఆ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయోగం ఏప్రిల్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో ఏడు రోజుల్లో రూ.75.74 కోట్ల వసూలు లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది మొత్తం వసూళ్ల లక్ష్యం రూ.130.02 కోట్లు కాగా ఇప్పటికి రూ.54.,28 కోట్లు వసూలు చేశారు. పన్నులు చెల్లించాలని కోరుతూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు.
కోవూరు మండల పరిషత్ అధ్యక్షురాలు పార్వతి భర్త చంద్ర తెలుగుదేశం పార్టీలో చేరారు. వేగూరుకు చెందిన చంద్ర ఆదివారం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు.
నెల్లూరులోని కోటమిట్టకు చెందిన మసూద్, బారకాసు సెంటర్ కు చెందిన సోహెల్ స్నేహితులు. ఫోన్ లో మాట్లాడుకునే సమయంలో వాగ్వాదం జరిగి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. శనివారం రాత్రి సోహెల్ ఫోన్ చేసి పిలవడంతో మరొకరితో పాటు రంగనాయకులపేటకు మసూద్ వెళ్లాడు. అక్కడ మాటామాటా పెరగడంతో సోహెల్ తన స్నేహితులతో కలిసి మసూద్ ను కత్తితో పొడిచి పరారయ్యాడు. మసూద్ ను అస్పత్రికి తరలించారు. సంతపేట పోలీసులు విచారణ చేపట్టారు.
జిల్లాలో 2019లో 79.77 ఓటింగ్ శాతం నమోదైందని, అంతకంటే ఓటింగ్ శాతం పెంచడం, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని చైతన్య పరచడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. ఇప్పటికే ఈవీఎంలపై అవగాహన కల్పించామని, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు రాజకీయాల్లో సంచలనంగా మారారు. కొద్ది రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆయన టీడీపీ, జనసేన పార్టీల్లో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరకు బీజేపీ గూటికి చేరారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. సాయంత్రానికి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. గతంలోనూ ఆయన తిరుపతి ఎంపీగా వ్యవహరించారు.
Sorry, no posts matched your criteria.