India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూళ్లూరుపేట మదీనా టపాసుల గోడౌన్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చెన్నైకి తరలించారు. ఇందులో ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకుమార్, రవి శరీరం 90 శాతం కాలిపోయింది. వీళ్లు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సూళ్లూరుపేట ఎస్ఐ రహీం వెల్లడించారు. మిగిలిన వారికి ఎలాంటి ప్రాణపాయం లేదని స్పష్టం చేశారు.
తాము ఎవరికీ అందుబాటులో ఉండమన్న అపోహ నాయకులు, కార్యకర్తల్లో ఉందని.. అలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. తాను ప్రతి నాయకుడు, కార్యకర్తకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. నార్త్ రాజుపాలెంలో వేమిరెడ్డి దంపతుల పరిచయ కార్యక్రమం పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దినేశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. పోలంరెడ్డి కుటుంబం తరహాలోనే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ప్రశాంతి చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మద్యం గోడౌన్, తయారీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ తనిఖీ చేశారు. బుధవారం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని దేవరపాలెం వద్ద గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు.
బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన టిడిపి ముఖ్య నాయకుడు గుత్తా శ్రీనివాసులు బుధవారం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మండలపార్టీ అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి, బుచ్చి నగర సచివాలయాలు కన్వీనర్ మోర్ల మురళి, 14 వార్డుకౌన్సిలర్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఏఎస్ పేట మండలం చౌటభీమవరం గ్రామ పరిధిలో మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్‌పై వేటు పడింది. ఆ వాలంటీర్ పై పలు సెక్షన్ల పైన కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులకు ఆర్డీఓ మధులత ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
రత్నం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు కేవీ రత్నం భౌతికకాయానికి నెల్లూరు హరనాథపురంలోని ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యారంగానికి రత్నం అందించిన సేవలను స్మరించుకున్నారు. వీరి వెంట రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత రత్నం అనారోగ్య కారణంగా బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని వారి నివాసం నందు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.
నెల్లూరు జిల్లా పరిధిలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలు ప్రకటించింది. నెల్లూరు సీఐడీ డీఎస్పీ కె.వేణుగోపాల్‌కు ఉత్తమ సేవాపతకం, ఉదయగిరి సీఐ ఎ.గిరిబాబు, దర్గామిట్ట, పొదలకూరు, చిన్నబజారు హెడ్ కానిస్టేబుళ్లు, కావలి అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఫైర్‌మెన్‌కు సేవా పతకాలు ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వీటిని వాళ్లు అందుకోనున్నారు.
కుమారుడే తండ్రిని హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఇందుకూరుపేట మండలం డేవిస్ పేటలో కుటుంబ కలహాలతో భార్య వెంకట రమణమ్మపై భర్త ప్రసాద్ గడ్డపారతో దాడి చేశాడు. ఈక్రమంలో భార్య కోమాలోకి వెళ్లింది. ఇది గమనించిన వాళ్ల పెద్ద కుమారుడు మహేశ్ గడ్డపారతో తండ్రిని పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాగం పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,470 కేంద్రాలను పరిశీలించామన్నారు. ఇందులో 420కు పైగా క్రిటికల్ సెంటర్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.