Nellore

News March 20, 2024

నెల్లూరు: లక్షితను చంపిన చిరుత గుర్తింపు

image

గతేడాది ఆగస్టులో అలిపిరి వద్ద చిరుత దాడిలో నెల్లూరు జిల్లా కోవూరు(M) పోతిరెడ్డిపాలేనికి చెందిన లక్షిత చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లు పెట్టి 6 చిరుతలను అధికారులు పట్టుకుని తిరుపతి జూపార్క్‌కు తరలించారు. DNA రిపోర్టు ఆధారంగా నాలుగో చిరుత లక్షితను చంపేసినట్లు గుర్తించారు. దాని కోర పళ్లు నాలుగు రాలిపోవడంతో జూపార్కులోనే ఉంచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సతీశ్ కుమార్‌రెడ్డి చెప్పారు.

News March 20, 2024

నెల్లూరు: 943 మంది గైర్హాజరు

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 943 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అధికారులు తెలిపారు. హిందీ పరీక్ష రెగ్యులర్‌కు సంబంధించి 28,280 మందికి గాను 27,722 మంది పరీక్షలు రాశారు. ప్రైవేట్‌కు సంబంధించి 490 మంది విద్యార్థులకు గాను 385 మంది గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు.

News March 20, 2024

ఆత్మకూరులో ముగ్గురు వాలంటీర్లపై వేటు

image

ఆత్మకూరు నియోజకవర్గంలోని ముగ్గురు వాలంటీర్లపై వేటు వేసినట్లు రిటర్నింగ్ అధికారిని ఆర్డీవో మధులత తెలిపారు. చేజర్ల మండలం పాడేరు గ్రామంలో మేకపాటి విక్రం రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇద్దరు వాలంటీర్లు పాల్గొన్నారు. సంగం MPDO కార్యాలయంలో రాజకీయ నాయకులతో కలిసి ఓ వాలంటీర్ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. దీంతో ముగ్గురిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

News March 20, 2024

లక్షకు పైగా నగదు లావాదేవీలు జరిపిన వారి వివరాలు తెలపండి

image

కలెక్టర్ కార్యాలయం నందు బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లక్ష రూపాయలకు పైగా నగదు లావాదేవీలు జరిపిన వారి వివరాలు ప్రతిరోజూ అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ ప్రదీప్, ఎన్నికల ఖర్చు మోనిటరింగ్ నోడల్ అధికారి విద్యాసాగర్, బ్యాంక్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News March 19, 2024

నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

image

నెలవారీ నేర సమీక్షా సమావేశం నెల్లూరులోనే ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డి నిర్వహించారు. జిల్లాలో చోటు చేసుకున్న, పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్థి సంబంధిత నేరాలలో విచారణ గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జీరో-వయోలెన్స్, జీరో-రీపోలింగ్ తో సార్వత్రిక ఎన్నికల నిర్వహణే ధ్యేయమన్నారు.

News March 19, 2024

నెల్లూరు: విధుల నుంచి వాలంటీర్ తొలగింపు

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వెంగళరావ్ నగర్ -2 వార్డు సచివాలయ పరిధి వాలంటీర్ జె. శ్రీనివాసులును విధుల నుంచి తొలగిస్తూ రిటర్నింగ్ అధికారి/నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లబ్దిదారుల వివరాలను అందజేస్తూ, ఇతర వాలంటీర్లను కూడా వివరాలు అందించాలని ప్రేరేపించే సందేశాలను పంపిస్తున్నందున వాలంటీర్‌ను విధుల నుంచి తప్పించారు.

News March 19, 2024

23న సర్వేపల్లికి నారా భువనేశ్వరి

image

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మార్చి 23న సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలంలో రెండు కుటుంబాలను పరామర్శిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.

News March 19, 2024

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా పోలంరెడ్డి

image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరును ప్రకటించిన నేపథ్యంలో దినేష్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

News March 19, 2024

జొన్న సేకరణకు రిజిస్టేషన్ ప్రారంభం

image

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి జొన్న, మొక్కజొన్న సేకరణకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు మేరకు జొన్న పంట ఒక క్వింటాకు రూ.3180, మొక్కజొన్న పంట క్వింటాకు రూ.2090 కనీస మద్దతు ధరగా ప్రకటించారు.

News March 19, 2024

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవు: కలెక్టర్

image

రాజకీయ పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లు, ప్రభుత్వంలో పనిచేసే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ హెచ్చరించారు. ప్రభుత్వంలో పనిచేసేవారు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొంటున్నారని వివిధ పత్రికలలో వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు.