India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూళ్లూరుపేట హోలీక్రాస్ సర్కిల్ వద్ద ఉన్న టపాసుల గోడౌన్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టపాసులు తయారుచేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగసి పడ్డాయి. ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జలదంకి మండల పరిధిలోని చిన్న కాక వద్ద అదుపుతప్పి గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ లారీలోనే చిక్కుకుపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు రక్షించి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రిలో తరలించినట్లు స్థానికులు తెలిపారు.
ఆత్మకూరు పట్టణంలోని ఒక మద్యం దుకాణంలో నగదు చోరీకి గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాపు ఒక వైపు గోడకు రంద్రం వేసి లోనికి ప్రవేశించి దుకాణంలోని రూ. 3.89 లక్షల నగదు చోరీ చేశారు. ఉదయం దుకాణం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడైన చెవిరెడ్డి సుధాకర్ రెడ్డి 2011లో స్వప్నను పెళ్లి చేసుకున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని 2017లో ఆమె పోలీసులను ఆశ్రయించారు. విచారించిన వెంకటగిరి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించినట్లు ఏపీపీ ప్రకృతి కుమార్ తెలిపారు.
నెల్లూరుకు చెందిన సురేశ్ బాబు 2022లో ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ కొన్నారు. మైలేజీ రాకపోగా పది రోజులకే సెన్సార్ పనిచేయలేదు. బ్రేకులు ఫెయిలయ్యాయి. మరమ్మతులు చేయాలని లేదా కొత్త స్కూటర్ ఇవ్వాలని పలుమార్లు బాధితుడు కోరినా కంపెనీ నుంచి స్పందించక పోవడంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 45 రోజుల్లో కొత్త స్కూటర్ ఇవ్వడంతో పాటు రూ.5 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులందరూ మారిపోయారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ముఖాముఖి తలపడిన నేతలెవరూ ఈసారి పరస్పరం పోటీపడే పరిస్థితి లేకుండాపోయింది. పోటీలో ఒకరు పాత వారే అయినప్పటికీ మరొకరు మాత్రం వారికి కొత్త ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. కొన్ని చోట్ల రెండూ కొత్తముఖాలే కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులందరూ మారిపోయారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ముఖాముఖి తలపడిన నేతలెవరూ ఈసారి పరస్పరం పోటీపడే పరిస్థితి లేకుండాపోయింది. పోటీలో ఒకరు పాత వారే అయినప్పటికీ మరొకరు మాత్రం వారికి కొత్త ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. కొన్ని చోట్ల రెండూ కొత్తముఖాలే కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.
నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ స్థానానికి 1962 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. అత్యధికంగా నల్లపరెడ్డి కుటుంబ సభ్యులే ఇక్కడ గెలిచారు. తాజా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రశాంతి రెడ్డి 62 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతుందేమో చూడాలి మరి..
నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు గిరిప్రదక్షిణ, అంకురార్పణతో రేపు ప్రారంభం కానున్నాయి. 20న తిరుమంజనం, ధ్వజారోహణ, శేషవాహన సేవ, 21న హనుమంత సేవ, 22న ఉదయం మోహినీ ఉత్సవం, రాత్రికి గరుడసేవ, 23 ఉదయం మొక్కుబడులు, సాయంత్రం తెప్పోత్సవం, గజ వాహన సేవ, 24న ఉదయం కల్యాణం, సాయంత్రం రథోత్సవం, రాత్రికి అశ్వవాహన సేవ, 25న సాయంత్రం పుష్పయాగం, రాత్రి ఏకాంతసేవతో ఉత్సవాలు పూర్తవుతాయి.
కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఇన్‌ఛార్జ్ పోలంరెడ్డి దినేశ్ రెడ్డిని కాదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చంద్రబాబు ఖరారు చేశారు. అలకబూనిన పోలంరెడ్డి కచ్చితంగా కోవూరు నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో టీడీపీ పెద్దలు స్పందించి పోలంరెడ్డిని నిన్న విజయవాడలో చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఛైర్మన్, పార్టీ పదవి, 2027లో MLC హామీ ఇస్తానని పోలంరెడ్డికి హమీ ఇచ్చినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.