Nellore

News April 7, 2024

కొండాపురం: బోల్తాపడ్డ ట్రాక్టర్.. దూకేసిన కూలీలు

image

కొండాపురం మండలం పార్లపల్లి సమీపంలోని పొలాల్లో పొగాకు లోడుతో ఉన్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఆ సమయంలో ట్రాక్టర్ లో 15 మంది కూలీలు ఉన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాళ్లు వెంటనే కిందికి దూకి తృటిలో ప్రాణాలు కాపాడుకున్నారు. లోడుతో ఉన్న ట్రాక్టర్ పొలంలోంచి రోడ్డుపైకి ఎక్కిస్తుండగా అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు అక్కడున్న వారు తెలిపారు.

News April 7, 2024

బ్యాడ్మింటన్ ఆడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పర్యటించిన టీడీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. క్రీడాకారులతో పాటు వాకర్స్ వారిని చప్పట్లతో ప్రోత్సహించారు.

News April 7, 2024

3 నెలలు బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్: ఈఈ

image

నెల్లూరు నగరంలో విద్యుత్ బకాయిలను వేగవంతం చేసి వంద శాతం వసూళ్లకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యుత్ శాఖ ఈఈ సోమశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 3 నెలలు బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్ తొలగించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో అదనపు లోడు అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు.

News April 7, 2024

చేజర్ల: కన్నతండ్రికి కొరివి పెట్టని కొడుకు, కూతురు

image

చేజర్ల మండలం కోటితీర్థం గ్రామంలో శనివారం కోటారెడ్డి అనే వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జలదంకి మండలం బ్రాహ్మణకాకు చెందిన ఇతను 5 ఏళ్లుగా కోటి తీర్ధంలోని వెంకయ్యస్వామి ఆశ్రమంలో జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా… మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రానట్లు స్థానికులు చెబుతున్నారు.

News April 7, 2024

సౌదీ అరేబియాలో నెల్లూరు వాసుల మృతి

image

సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుత్తలూరు, గుంటూరుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయ. నర్రవాడకు చెందిన సత్యబాబు సౌదీలోని ఓ పారిశ్రామిక సంస్థలో ఇంజినీరుగా పని చేస్తున్నారు. భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అతని మామ గుంటూరుకు చెందిన రామారావు దంపతులు వారి వద్దకు విజిటింగ్ వీసాపై వెళ్లారు. విమానాశ్రయం నుంచి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

News April 6, 2024

కోవూరు: ఒకే వేదికపైకి నల్లపరెడ్డి సోదరులు

image

సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోవూరు మీదుగా వెళ్లిన సందర్భంగా నల్లపరెడ్డి సోదరులు ఒకే చోట కనిపించారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజేంద్రకుమార్ రెడ్డి మాట్లాడిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ దశలో రాజేంద్ర రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సైతం జరిగింది. ఈ క్రమంలో అందరూ కలవడంపై నల్లపరెడ్డి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News April 6, 2024

కావలి: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసిన సీఎం

image

కావలిలో శనివారం జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులను సీఎం జగన్ పరిచయం చేశారు. ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, అబ్దుల్ ఖలీల్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, మధుసూదన్ యాదవ్ లను ఆశీర్వదించాలని కోరారు.

News April 6, 2024

నెల్లూరు: CM జగన్‌ని కలిసిన జబర్దస్త్ ఫేమ్ రియాజ్

image

నెల్లూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శనివారం జబర్దస్త్ ఫేమ్ రియాజ్ కలిశారు. పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్ జగన్‌ను కలిశారు. కాగా రియాజ్ వైసీపీ దివ్యాంగుల నగర కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. రియాజ్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

News April 6, 2024

నెల్లూరు: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ

image

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ముంబై జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ సీట్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికుల సహాయంతో బయటకి తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2024

నెల్లూరు జిల్లాలో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర

image

నెల్లూరు జిల్లాలో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న బస్సు యాత్ర కోవూరు క్రాస్ రోడ్, సున్నపుబట్టి,తిప్ప, గౌరవరం మీదుగా ఆరేస్సార్ ఇంటర్నేషనల్ వద్దకు చేరుకొని కొద్దిసేపు భోజన విరామం ఉంటుంది. అనంతరం కావలి పరిధిలోని జాతీయ రహదారి వద్దకు చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.