Nellore

News April 4, 2024

నెల్లూరు: ఈనెల 14 వరకు అవకాశం

image

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు నమోదుకు ఈ నెల 14 వరకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 20,44,815 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్లు చెప్పారు. ఓటరు జాబితాలో ఏవైనా చిన్న తప్పులుంటే ఎన్నికల సంఘం సూచించిన 10 గుర్తింపు కార్డుల్లో దేన్నైనా చూపి ఓటు వేయవచ్చన్నారు.

News April 4, 2024

గూడూరులో రోడ్డు ప్రమాదం

image

గూడూరు బైపాస్ కూడలిలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే అతను మృతిచెందాడు. మృతుడు గూడూరు మండలం పోటుపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి ఏడుకొండలుగా గుర్తించారు. వెల్డింగ్ పనులు చేసుకుని జీవనం సాగించే అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

News April 4, 2024

నెల్లూరు: నేటి నుంచి ఒక్కపూట అంగన్వాడీ

image

రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలను ఒంటి పూట నిర్వహించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని పీడీ ఆదేశించారు.

News April 4, 2024

తూర్పు కనుపూరులో భక్తుల సందడి

image

తిరుపతి: చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ కొలువైన ముత్యాలమ్మ అమ్మవారి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం భక్తుల తాకిడి పెరిగింది. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మరో రెండు రోజులపాటు జాతర నిర్వహించనున్నారు.

News April 3, 2024

రేపు నాయుడుపేటలో ట్రాఫిక్ ఆంక్షలు

image

తిరుపతి: నాయుడుపేటలో రేపు ‘మేమంతా సిద్ధం’ సబ జరగనుండడంతో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు నాయుడుపేట సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నర్సారెడ్డి కండ్రిగ NH -16 సమీపంలో రేపు సాయంత్రం సభ జరగనుండటంతో నెల్లూరు వైపు నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలు గూడూరు జంక్షన్ నుంచి వయా గూడూరు టౌన్ మీదుగా మళ్లించినట్లు తెలిపారు.

News April 3, 2024

సూళ్లూరుపేట: పెన్షన్ కోసం వచ్చి మహిళ మృతి

image

పెన్షన్ కోసం వచ్చి ఓ మహిళ మరణించిన ఘటన బుధవారం సూళ్లూరుపేట పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… సూళ్లూరుపేట పట్టణం సాయినగర్‌కు చెందిన లలితమ్మ (58) అనే మహిళ పెన్షన్ కోసం మధ్యాహ్నం నుంచి స్త్రీ శక్తి భవనం వద్ద పడిగాపులు కాచింది. పెన్షన్ ఆలస్యం కావడంతో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News April 3, 2024

సూళ్లూరుపేటలో బానుడి ప్రతాపం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారటీ ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించింది. సూళ్లూరుపేటలో అత్యధికంగా 43.1 డిగ్రీల సెంటిగ్రేడ్ సమోదుకాగా.. వాకాడు మండలంలో కనిష్టంగా 36.5 డిగ్రీలు నమోదయ్యాయి. రేపు. ఎల్లుండి సూళ్లూరుపేటలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.

News April 3, 2024

నెల్లూరు: వైసీపీ ప్రచారంలో హోంగార్డు..?

image

జిల్లాలోని కొండాపురం మండలం పెరికిపాలెంలో వైసీపీ ప్రచారం జరిగింది. ఇందులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా జీతం తీసుకునే ఏ ఒక్కరూ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

News April 3, 2024

నెల్లూరు: చెరువులో యువకుడి గల్లంతు

image

నెల్లూరు జిల్లాలో ఓ యవకుడు చెరువులో మునిగిపోయాడు. మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన కోటేశ్వరరావు గేదెలు రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో వాటిని వెతుక్కుంటూ వెళ్లాడు. ఈక్రమంలో చెరువులో దిగగా.. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. ఎస్ఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

News April 3, 2024

ఆనం ఫ్యామిలీకే తక్కువ మెజార్టీ..!

image

ఆనం సంజీవ రెడ్డి 1958లో కాంగ్రెస్ తరఫున ఆత్మకూరులో పోటీ చేశారు. కేవలం 45 ఓట్ల తేడాతో MLAగా గెలిచారు. జిల్లాలో ఇప్పటి వరకు తక్కువ మెజార్టీ ఆయనదే. 1962లో వి.వెంకురెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి 86 ఓట్ల మెజార్టీతో MLAగా ఎన్నికయ్యారు. 2009లో నెల్లూరు సిటీలో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి(PRP) కేవలం 90 ఓట్ల తేడాతో అనిల్ కుమార్ యాదవ్(CONG)పై గెలిచారు. తాజా ఎన్నికల్లో ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందా?