India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాయుడుపేట బీడీ కాలనీలో ప్రసాద్ అనే వ్యక్తిపై మస్కుద్, మౌళి అనే ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ప్రసాద్‌ను గొంతుపై కత్తితో కోయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి వచ్చేసరికి మస్కుద్, మౌళి పరారయ్యారు. గాయపడిన ప్రసాద్‌ను నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తిరుపతి జిల్లాలోని తడ, నాయుడుపేటలో ఈనెల 4న తేదీన సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సిద్ధం సభ ఏర్పాట్లను కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డితో పాటు పలువుర నాయకులు కలిసి సభాప్రాంగణాన్ని పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
అనంతసాగరం మండలం ఉప్పలపాడు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు వైపు నుంచి బద్వేలు వైపు వెళ్తుండగా సిలికా లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు.
బోగోలుకు చెందిన వెంకటేశ్వరరావు గతంలో ఎస్సై వెంకటరమణ తీరుపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 2016 జూన్ 24న బిట్రగుంటలో టీ తాగుతుండగా ఎస్సై అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించారని బాధితుడు కోర్టును ఆశ్రయించారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్సై వెంకటరమణకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి తీర్పు చెప్పారు.
వరికుంటపాడు మండలం రామదేవులపాడులో రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ విజయసంకల్ప యాత్రలో వింజమూరు మండలం నందిగుంట ఉపాధ్యాయుడు జక్కం మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దీనిపై నోడల్ అధికారి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ రెడ్డిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతయ్య తెలిపారు.
ఉదయగిరి అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సమయాన్ని ప్రభుత్వం మార్పు చేసిందని సిడిపిఓ పచ్చవ లావణ్య సోమవారం తెలిపారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మినీ, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలన్నారు. వేసవి సెలవులు కార్యకర్తలకు మే 1 నుంచి 15వ తేదీ వరకు, ఆయాలకు మే 16 నుంచి మే 31వరకు ఉంటాయన్నారు.
రాపూరు- చిట్వేల్ ఘాట్ రోడ్ 12 కిలోమీటర్ వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా నెల్లూరుకి తరలించారు. చిట్వేల్ ఘాటు వద్ద ఉసిరికాయలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులు పంగిలి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
వాలంటీర్ల నుంచి సిమ్ కార్డులు, ఫోన్లు వెంటనే స్వాధీనం చేసుకోవాలని నెల్లూరు జడ్పీ సీఈవో కన్నమ నాయుడు ఆదేశించారు. ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బుధవారం నుంచి సచివాలయం వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.
రైలు కిందపడి టీచర్ మృతిచెందిన ఘటన గూడూరులో వెలుగు చూసింది. గూడూరు మండలం వెందోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మ్యాథ్స్ టీచర్ కృష్ణప్రసాద్ సోమవారం ఉదయం గూడూరు రైల్వే స్టేషన్‌లో చెన్నై మెమూ రైలు దిగుతుండగా ప్రమాదశావత్తు జారిపడిపోయారు. రైలు కింద పడిపోవడంతో చనిపోయారని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాంగ్రెస్‌తో విభేదించిన జగన్ YCPని స్థాపించారు. అదే పార్టీ నుంచి జగన్ కంటే ముందే నెల్లూరులో ఒకరు MLAగా గెలిచారు. ఆయనే ప్రసన్న కుమార్ రెడ్డి. 2009లో TDP కోవూరు MLAగా గెలిచిన ఆయన జగన్ పార్టీలో చేరారు. దీంతో 2012 మార్చిలో ఉప ఎన్నిక జరగ్గా YCP తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో YCP నెల్లూరు MPగా మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు మరో 14 మంది వైసీపీ MLAలుగా గెలిచారు.
Sorry, no posts matched your criteria.