Nellore

News March 31, 2024

నెల్లూరు: ఏపీ రాష్ట్ర నిర్వహణ విపత్తుల సంస్థ

image

నేడు 50 మండలాల్లో వడగాల్పులు రేపు 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ అధికారి కూర్పునాథ్ తెలిపారు. శుక్రవారం 36 మండలాల్లో వడగాల్పులు కడప జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

News March 31, 2024

ఉదయగిరి: ఆగిన డీజే టిల్లు-2 మూవీ.. ఫ్యాన్స్ ఆందోళన

image

ఉదయగిరి పట్టణంలోని సికిందర్ పిక్చర్ ప్యాలెస్ ఎదుట సినీ వీక్షకులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. డీజే టిల్లు- 2 చిత్రం చూసేందుకు వచ్చిన వీక్షకులకు అసౌకర్యానికి గురై నిర్వాహకులతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చిత్రం ప్రసార సమయంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వీక్షకులు ఆందోళన చేపట్టారు. అనంతరం మూకుమ్మడిగా టికెట్ ఇచ్చి తిరిగి డబ్బులు తీసుకుని వెనుతిరిగారు.

News March 31, 2024

నెల్లూరు: హైకోర్టు జడ్జీలను కలిసిన కమిషనర్

image

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జయసూర్య, హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్బారెడ్డిని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్థానిక జిల్లా కోర్టు కాంప్లెక్‌లో జిల్లా న్యాయ అధికారుల వర్క్ షాష్‌కు న్యాయమూర్తులు హాజరయ్యారు.

News March 30, 2024

నెల్లూరు: నాయుడుపేటలో సిద్ధం బహిరంగ సభ

image

నాయుడుపేట పట్టణంలో ఏప్రిల్ 4వ తేదీన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి సభ ఏర్పాట్లను పరిశీలించారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ సభకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

News March 30, 2024

నెల్లూరు: పోలింగ్‌కు 15 వేల మంది సిబ్బంది

image

జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి 15వేల మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని పలు ప్రభుత్వ మహిళా కళాశాలలో అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు.

News March 30, 2024

చంద్రబాబుపై కావలి ఎమ్మెల్యే ఫైర్

image

మాజీ సీఎం చంద్రబాబుపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తాను భూకబ్జాలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి విరమించుకుంటానని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎవరో రాసి పంపిన స్క్రిప్ట్ చదవడం విడ్డూరంగా ఉందన్నారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏమి అభివృద్ధిలో చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

News March 30, 2024

నెల్లూరు: బొల్లినేని అడుగులు ఎటో !

image

ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు రాజకీయ అడుగులు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు పర్యటనలో మొక్కుబడిగా పాల్గొని కీలక సమావేశాలకు దూరంగా ఉండటం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన ఓడారు.2014 ఎన్నికల్లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. కాగా బీజేపీ జాతీయ నేతలతో బొల్లినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

News March 30, 2024

నెల్లూరు: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే విష్ణు

image

మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సూచనలు, సలహా మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితమే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆయన వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో కావలిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

News March 30, 2024

నెల్లూరు: జులై నుంచి 4 వేలు పెన్షన్: కేతం రెడ్డి 

image

నెల్లూరు సిటీ పరిధిలో 5వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణని గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం గెలవగానే జులై నెల నుంచి 4వేలు పెన్షన్ ఇస్తామని అవ్వ, తాతలకు భరోసా కల్పించారు. వైసీపీ ప్రభుత్వం ఒక చేత్తో సంక్షేమ పథకాలిచ్చి మరొక చేత్తో అధిక ధరల రూపంలో లాక్కోవడం సరికాదన్నారు.

News March 30, 2024

కావలిలో వ్యక్తి దారుణ హత్య.. తల్లీకొడుకుల అరెస్ట్

image

కావలి: పెదరాముడుపాళేనికి చెందిన చిన్నగోపాల్‌తో అసహజ శృంగారం చేసిన బుచ్చంగారి ఎజ్రానే ఈ హత్యలో నిందితుడని కావలి DSP వెంకటరమణ పేర్కొన్నారు. నిందితుడు చిన్నగోపాల్‌పై లైంగిక దాడికి పాల్పడడంతో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో నిందితుడు అతణ్ని తాళ్లతో కట్టేసి గొంతు వద్ద తాడుతో బిగించి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని తగలబెట్టేందుకు నిందితుడి తల్లి మంగమ్మ కూడా సహకరించింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.