India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైదాపురం మండలం లింగసముద్రానికి చెందిన ప్రేమ్ కుమార్ చెన్నూరు రెసిడెన్షియల్ స్కూలులో చదువుకుంటున్నాడు. గురువారం రాత్రి స్కూలులో వార్షికోత్సవం సందర్భంగా వాహనం పార్కింగ్ విషయంలో స్థానిక యువకుడు విష్ణుకి ఇంటర్ చదివే ప్రేమ్ కుమార్ అన్న అశోక్ తో వాగ్వాదం జరిగింది. విష్ణు కత్తితో దాడి చేయడంతో అశోక్ గాయపడ్డాడు. ఈ మేరకు ఎస్సై మనోజ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయగిరి తెలుగుదేశం పార్టీలో రేగిన అసమ్మతి చల్లారేలా కనిపించడం లేదు. వింజమూరులో ఇవాళ టీడీపీ అధినేత నిర్వహించిన ప్రజాగళం సభకు మాజీ MLA బొల్లినేని రామారావు దూరంగా ఉన్నారు. చంద్రబాబు సభాస్థలికి రాకమునుపే బస్సులో ఆయనతో సమావేశమైన రామారావు.. తర్వాత రాత్రి చంద్రబాబు బస ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. ఉదయగిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బొల్లినేనిని కాదని టీడీపీ అధిష్ఠానం కాకర్లకు అవకాశం కల్పించింది.
వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారని.. ఎదురుతిరిగిన వారిపై కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కావలిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలపైనే కేసులు పెట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే టీడీపీకి షాక్ ఇచ్చారు. అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సీఎం జగన్‌ను కలిసి చేరికపై చర్చించినట్లు సమాచారం.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా కావలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి MLA అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, రూప్ కుమార్ యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి బొకేలు అందజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు సమీపంలో అమరావతి హోటల్ వద్ద జాతీయ రహదారిపై బస్సు, కారు, మరో వాహనం ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. పలువురికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 6న కావలి పట్టణానికి రానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు బస్సు యాత్ర ఏర్పాట్లు రూట్ మ్యాప్ ను పరిశీలించారు. బస్సు యాత్ర కార్యక్రమంతో వైసీపీకి విశేష ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు. మరోసారి వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నెల్లూరు నగరం సంతపేటలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఎడ్ సెట్ అర్హత సాధించి ఎక్కడా అడ్మిషన్ పొందని విద్యార్థులు ఏప్రిల్ 2వ తేదీ వరకు కళాశాలలో జరిగే స్పాట్ కౌన్సిలింగ్ లో పాల్గొనాలని సూచించారు. రిజిస్ట్రేషన్, కాలేజీ ఫీజుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని కోరారు.
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇటీవల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో గురువారం స్వామివార్ల హుండీ కానుకలను లెక్కించారు. ఈక్రమంలో రూ.16,39,801 ఆదాయం వచ్చిందని ఈవో రాధా కృష్ణ తెలిపారు. ఇది గతేడాది కంటే ఎక్కువ అని చెప్పారు.
నాయుడుపేట-పెద్దపరియ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి చనిపోవడాన్ని గూడూరు రైల్వే పోలీసులు గుర్తించారు. రైల్వే ఎస్ఐ కొండప్ప నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి రైలు వస్తుండగా పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. మృతుడు గళ్ల లుంగి, ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని గూడూరు ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.