Nellore

News March 27, 2024

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవసేనమ్మ?

image

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వచ్ఛ ఆంధ్ర ఛైర్‌‌పర్సన్ పి.దేవసేనమ్మ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకటగిరి సీటును నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగా ఆయనపై అసమ్మతి వర్గం దండెత్తడంతో ఆయన పేరు మార్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అధిష్ఠానం నుంచి దేవసేనమ్మకు పిలుపు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

News March 27, 2024

REWIND.. నెల్లూరులో ‘ఉదయించిన సూర్యుడు’

image

నెల్లూరు నియోజకవర్గంలో 1989 ఎన్నికల్లో జక్కా కోదండరామి రెడ్డి(జేకే రెడ్డి) సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగగా ఎన్నికల కమిషన్ ఉదయించే సూర్యుడు గుర్తు కేటాయించింది. ఆ ఎన్నికల్లో ప్రచారాన్ని జేకే రెడ్డి సరికొత్త పుంతలు తొక్కించారు. అందరి మనస్సు చూరగొని తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి తాళ్లపాక రమేష్ రెడ్డిపై 14474 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

News March 27, 2024

కావలిలో దారుణం ..హత్య చేసి.. ఇంటి వద్దే పూడ్చి..

image

కావలి రూరల్ మండలం పెద్దరాముడుపాళెంలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 19న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పని ఉందని కాటంగారి చిన్నగోపాల్(27)ను తీసుకెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాలు, కుటుంబ సభ్యుల వద్ద ఆరాతీశారు. గోపాల్‌ను తీసుకెళ్లిన వ్యక్తి తన ఇంటి వెనకే పూడ్చినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కావలి రూరల్ సీఐ శ్రీనివాస గౌడ్ విచారణ చేపట్టారు.

News March 27, 2024

సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి: SFI

image

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హర్ష కోరారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రామచంద్రా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసి 90 రోజుల తరువాతే పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరేంద్ర, చరణ్ తదితరులు ఉన్నారు.

News March 26, 2024

నెల్లూరులో రంగడి తేరు రేపే

image

ఉమ్మడి నెల్లూరు ప్రజలు ఎంతో ఆనందంగా భాగస్వాములయ్యే రంగడి తేరు (శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం) బుధవారం జరగనుంది. ఉదయం 8.30 గంటలకు సర్వాలంకార శోభితులైన దేవేరుల సమేత రంగనాథుడు విశేషంగా అలంకరించిన రథంలో కొలువుదీరుతారు. అనంతరం గోపురం వీధిలో రైల్వే గేటు వరకు తిరిగి ఆలయం మీదుగా సంతపేట నాలుగు కాళ్ల మండపం వరకు రథోత్సవం సాగనుంది. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

News March 26, 2024

ఎద్దుల బండి గుర్తుతో కంభం సంచలనం

image

ఉదయగిరిలో 1994 ఎన్నికల ప్రత్యేకతే వేరు. కంభం విజయరామి రెడ్డి టీడీపీ సీటు రేసులో ఉండగా అనూహ్యంగా కొండపల్లి గురవయ్య నాయుడు బీఫామ్ దక్కించుకున్నారు. చివరిలో మళ్లీ టీడీపీ అధిష్ఠానం కంభంకే మద్దతు పలికింది. అప్పటికే సమయం మించడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎద్దుల బండి గుర్తుతో పోటీ చేశారు. 61 శాతం ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికై కంభం సంచలనం సృష్టించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మాదాల జానకిరాం నిలిచారు.

News March 26, 2024

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ

image

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఉదయగిరి పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు 26 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు ఏర్పాటు చేసి ఇప్పటికే తనిఖీలు చేపట్టామన్నారు.

News March 26, 2024

వేడెక్కిన వెంకటగిరి రాజకీయం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు పార్టీలోని అసమ్మతి నేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీలో రాంకుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తూ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు టీడీపీలో సీటు దక్కలేదని కీలక నేత మస్తాన్ యాదవ్ ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు.

News March 26, 2024

నెల్లూరు: నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు

image

గూడూరు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. YCPని వీడి BJPలో చేరిన గూడూరు MLA వరప్రసాద్‌కు ఆ పార్టీ తిరుపతి టికెట్ కేటాయించింది. ఈక్రమంలో తొలిసారిగా గూడూరుకి వచ్చిన ఆయనకు TDP, జనసేన, BJP శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పొత్తులో భాగంగా గూడూరు నుంచి పాశం సునీల్, తిరుపతి MP అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రత్యర్థులుగా తలపడిన వీళ్లు ఇప్పుడు ఒకే కూటమి కింద ఒకరికొకరు ప్రచారం చేసుకుంటున్నారు.

News March 26, 2024

నెల్లూరు: టీడీపీకి మస్తాన్ యాదవ్ రాజీనామా

image

వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో వెనుకబడిన తరగతుల వారిపై చూపిన వివక్ష కారణంగా టీడీపీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.