Nellore

News March 23, 2024

NLR: ఒకే చోట 9వ సారి MLAగా పోటీ

image

కోవూరులో వరుస విజయాలతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 1993లో తొలిసారిగా ఆయన ఎన్నికల బరిలో దిగారు. తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్న తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 99 ఎన్నికల్లోనూ విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఆరంభం నుంచి ఒకే నియోజకవర్గంలో కొనసాగుతూ 9వ సారి పోటీ చేయబోతున్నారు.

News March 23, 2024

నెల్లూరు: వాలంటీర్‌పై కేసు నమోదు

image

నెల్లూరు జిల్లాలో ఓ వాలంటీర్‌పై కేసు నమోదైంది. కావలి మండలం ఆముదాల వలస వాలంటీర్ తాత ప్రవీణ్ ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎన్నికల నియమావళి నోడల్ అధికారి వెంకటేశ్వర్లు దృష్టికి వచ్చింది. విచారణ చేపట్టిన ఆయన వాలంటీర్‌పై కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 23, 2024

నెల్లూరు: 18 ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్ పోస్టులను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. నగదు, మద్యంతో పాటు ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆయా చెక్ పోస్టుల్లో తనిఖీల పర్వం ప్రారంభమైంది.

News March 23, 2024

నెల్లూరు: నిలిచిన ఈసీల మంజూరు

image

నెల్లూరు జిల్లాలోని ప్రధాన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ 8 రోజులుగా ఈసీలు మంజూరు కావడం లేదు. ఈసీ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసే క్రమంలో సర్టిఫికెట్లు ఇవ్వడం నిలిపివేశారు. ఈ మేరకు సంబంధింత అధికారులు శుక్రవారం వెల్లడించారు.

.

News March 23, 2024

ఈ ఎన్నికల్లో సర్వేపల్లి ప్రత్యేకత ఇదే.!

image

సర్వేపల్లి నియోజకవర్గంలో మరోసారి పాత ప్రత్యర్థుల మధ్యే పోరు జరగనుంది. 2014, 19 ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య రసవత్తర పోరు సాగనుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఇలా పాత ప్రత్యర్థులు ముఖాముఖి తలపడే అవకాశం లేకుండాపోయింది. ఒక్క సర్వేపల్లి అభ్యర్థులకే ఆ అవకాశం దక్కింది.

News March 22, 2024

కావలి: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

image

కావలి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున రైలు ఢీకొని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ అరుణ పోలీసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ రైలు ట్రాక్‌ను దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఉండొచ్చన్నారు. మహిళ వయస్సు 35-40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. మృతురాలి దేహంపై రోజ్ కలర్ చుడీదార్, వైట్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ చున్నీ ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలన్నారు. 

News March 22, 2024

సోమిరెడ్డికే సర్వేపల్లి టికెట్

image

ఎట్టకేలకు సర్వేపల్లి టీడీపీ టికెట్‌పై ఉత్కంఠ వీడింది. ఇటీవల సర్వేపల్లిలో కొత్త అభ్యర్థి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టు ఐవీఆర్ కాల్స్‌లో సోమిరెడ్డితో పాటు మరికొందరు పేర్లు వినించాయి. ఎట్టకేలకు సోమిరెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. మూడో జాబితాలో ఆయన పేరు ఖరారు చేయడంతో కాకాణితో మరోసారి తలపడనున్నారు. మరోవైపు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డిని అధికారికంగా డిక్లేర్ చేశారు.

News March 22, 2024

నేను నెల్లూరు బిడ్డనే: విజయసాయి రెడ్డి

image

తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని నెల్లూరు MP అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. ‘నేను ఎక్కడి నుంచో రాలేదు. నేను నెల్లూరు బిడ్డనే. ఇక్కడే పుట్టి ఇక్కడే చదివా. విజయవాడ, విశాఖ, ఢిల్లీ వెళ్లినా నెల్లూరు సమస్యల పరిష్కారానికి కృషి చేశా. ప్రత్యర్థి లాగా ఇండోనేషియా, దుబాయ్‌లో నాకు వ్యాపారాలు లేవు. మాట ప్రకారం నెల్లూరు 47వ డివిజన్‌ స్వర్ణకారులకు 500 షాపులు నిర్మిస్తా’ అని ఆయన హామీ ఇచ్చారు.

News March 22, 2024

REWIND: నెల్లూరు 90 ఓట్లతో గెలిచారు..!

image

నెల్లూరు MLAలుగా ఇప్పటి వరకు 14 మంది గెలిచారు. ఇందులో తక్కువ మెజార్టీ(90) ముంగమూరు శ్రీధర్ రెడ్డిది కాగా అత్యధిక మెజార్టీ(31,268) కేవీ సుబ్బారెడ్డిది. 2009లో ముంగమూరు PRP తరఫున పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌‌పై గెలిచారు. 1978లో KV సుబ్బారెడ్డి కాంగ్రెస్.ఐ తరఫున బరిలో నిలిచి జనతా అభ్యర్థి ఆనం వెంకట రెడ్డిపై విజయం సాధించారు. ఈసారి ఈ రికార్డులు బ్రేక్ అవుతాయో లేదో చూడాలి.

News March 21, 2024

నెల్లూరు: ఆ నియోజకవర్గంలో గెలిస్తే రికార్డే..

image

సూళ్లూరుపేట నియోజకవర్గంలో మహిళా అభ్యర్థులు పోటీ చేసినా.. గెలిచిన దాఖలాలు లేవు. 1983లో కాంగ్రెస్ నుంచి M.లక్ష్మీకాంతమ్మ పోటీ చేయగా..TDP అభ్యర్థి S.ప్రకాశం చేతిలో ఓడిపోయారు. 2009లో V.సరస్వతి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా..TDP అభ్యర్థి పరసా వెంకటరత్నం చేతిలో ఓటమిపాలయ్యారు. 2024 ఎన్నికల్లో TDP తరఫున నెలవల విజయశ్రీ.. వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్య పోటీ చేస్తున్నారు. విజయశ్రీ గెలిచి రికార్డు సృష్టిస్తారా?