India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వెంగళరావ్ నగర్ -2 వార్డు సచివాలయ పరిధి వాలంటీర్ జె. శ్రీనివాసులును విధుల నుంచి తొలగిస్తూ రిటర్నింగ్ అధికారి/నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లబ్దిదారుల వివరాలను అందజేస్తూ, ఇతర వాలంటీర్లను కూడా వివరాలు అందించాలని ప్రేరేపించే సందేశాలను పంపిస్తున్నందున వాలంటీర్‌ను విధుల నుంచి తప్పించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మార్చి 23న సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలంలో రెండు కుటుంబాలను పరామర్శిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరును ప్రకటించిన నేపథ్యంలో దినేష్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
జిల్లావ్యాప్తంగా నేటి నుంచి జొన్న, మొక్కజొన్న సేకరణకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు మేరకు జొన్న పంట ఒక క్వింటాకు రూ.3180, మొక్కజొన్న పంట క్వింటాకు రూ.2090 కనీస మద్దతు ధరగా ప్రకటించారు.
రాజకీయ పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లు, ప్రభుత్వంలో పనిచేసే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ హెచ్చరించారు. ప్రభుత్వంలో పనిచేసేవారు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొంటున్నారని వివిధ పత్రికలలో వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు.
సూళ్లూరుపేట హోలీక్రాస్ సర్కిల్ వద్ద ఉన్న టపాసుల గోడౌన్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టపాసులు తయారుచేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగసి పడ్డాయి. ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జలదంకి మండల పరిధిలోని చిన్న కాక వద్ద అదుపుతప్పి గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ లారీలోనే చిక్కుకుపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు రక్షించి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రిలో తరలించినట్లు స్థానికులు తెలిపారు.
ఆత్మకూరు పట్టణంలోని ఒక మద్యం దుకాణంలో నగదు చోరీకి గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాపు ఒక వైపు గోడకు రంద్రం వేసి లోనికి ప్రవేశించి దుకాణంలోని రూ. 3.89 లక్షల నగదు చోరీ చేశారు. ఉదయం దుకాణం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడైన చెవిరెడ్డి సుధాకర్ రెడ్డి 2011లో స్వప్నను పెళ్లి చేసుకున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని 2017లో ఆమె పోలీసులను ఆశ్రయించారు. విచారించిన వెంకటగిరి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించినట్లు ఏపీపీ ప్రకృతి కుమార్ తెలిపారు.
నెల్లూరుకు చెందిన సురేశ్ బాబు 2022లో ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ కొన్నారు. మైలేజీ రాకపోగా పది రోజులకే సెన్సార్ పనిచేయలేదు. బ్రేకులు ఫెయిలయ్యాయి. మరమ్మతులు చేయాలని లేదా కొత్త స్కూటర్ ఇవ్వాలని పలుమార్లు బాధితుడు కోరినా కంపెనీ నుంచి స్పందించక పోవడంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 45 రోజుల్లో కొత్త స్కూటర్ ఇవ్వడంతో పాటు రూ.5 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది.
Sorry, no posts matched your criteria.