Nellore

News March 17, 2024

NLR: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

నెల్లూరు జిల్లా సంగం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీరాపేరు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగార్జున రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

BREAKING: నెల్లూరులో తప్పిన ప్రమాదం

image

నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. ప్లాట్ ఫాం-1పై హెటెన్షన్ వైర్ తెగిపడింది. దీంతో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఘటన సమయంలో పట్టాలపై రైలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు.

News March 17, 2024

ఎంపీ బరిలో గూడూరు ఎమ్మెల్యే

image

తిరుపతి ఎంపీ తాను పోటీలో ఉంటానని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ఏ పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు రాలేదు. అయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగానైన పోటీలో ఉంటానని ఆయన తన అనుచరులకు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీ, జనసేన నాయకులతో కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.

News March 17, 2024

నెల్లూరు: ఆరుగురు ఇంజినీర్లు.. ఓ CA

image

నెల్లూరు జిల్లా అభ్యర్థుల్లో పలువురు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. నేదురుమల్లి(వెంకటగిరి), సంజీవయ్య(సూళ్లూరుపేట), ఆదాల (నెల్లూరు రూరల్), రామిరెడ్డి(కావలి), కాకాణి(సర్వేపల్లి), విక్రం రెడ్డి(ఆత్మకూరు) ఇంజినీరింగ్ చదివారు. ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఛార్టెర్డ్ అకౌంటెంట్. ప్రసన్న(కోవూరు), రాజగోపాల్ రెడ్డి(ఉదయగిరి), మురళీధర్(గూడూరు) డిగ్రీ పూర్తి చేయగా, ఖలీల్(నెల్లూరు సిటీ) ఇంటర్ చదివారు.

News March 17, 2024

9వ సారి ప్రసన్న.. ఐదో సారి ఆదాల

image

నెల్లూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు పలువురు సీనియర్లు ఉండగా.. మరికొందరు తొలిసారి పోటీ చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 9వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి 5వ సారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్, గూడూరులో మురళీ తొలిసారి పోటీ చేస్తున్నారు.

News March 17, 2024

నెల్లూరు: ఎన్నికల ఫిర్యాదుల సహాయం కేంద్రం ఏర్పాటు

image

ఎన్నికల పక్రియ పై ఫిర్యాదు, సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణ తెలిపారు. 2024 ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 8 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల సౌకర్యార్థం కోసం హెల్ప్ లైన్ 1950 తోపాటు 0861- 2349402, 2349403, 2349404 ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు తెలిపారు.

News March 16, 2024

NLR: తొలిసారి ఎమ్మెల్యేలుగా నలుగురి పోటీ

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలుగురు వైసీపీ అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గూడూరు నుంచి మేరిగ మురళీధర్, నెల్లూరు నగరం నుంచి ఖలీల్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు. ఆదాల, రామిరెడ్డి నాలుగో సారి, కిలివేటి, కాకాణి మూడో సారి, మేకపాటి విక్రమ్ రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.

News March 16, 2024

కావలి: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

image

కావలి మాజీ శాసనసభ్యుడు వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా వేసి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

News March 16, 2024

వెంకటగిరి: వారసుల్లో పైచేయి ఎవరిదో ! 

image

వెంకటగిరి బరిలో నిలుస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ నేతల వారసులే. ఇద్దరికి ఇవే మొదటి ప్రత్యక్ష ఎన్నికలు. వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మిల కుమారుడు. టీడీపీ అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కుమార్తె. జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మి, రామకృష్ణ ముగ్గురూ వెంకటగిరి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. మరి వారసుల్లో పైచేయి ఎవరిదో.

News March 16, 2024

ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే

image

నెల్లూరు నగర శాసనసభ్యుడు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇప్పటికే ఆయన నరసరావుపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2008లో కార్పొరేటరుగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 19 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు.