India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజవేముల సురేంద్ర నాధ్ రెడ్డి గురువారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరులోని ఆనం నివాసంలో ఆత్మకూరు టీడీపీ MLA అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఆయనతో పాటు మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 16.90 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాంతో పాటు అక్రమంగా తరలిస్తున్న 164 మద్యం బాటిళ్లను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బంగాళాఖాతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధించినట్లు కోట ప్రాంత మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రెడ్డి నాయక్ తెలిపారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో మరబోట్లతో వేట నిషేధించామని వెల్లడించారు. ఉల్లంఘించిన వారి మరబోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు డీజిల్, ఇతర రాయితీలను రద్దు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలో పలు నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ పరిశీలకులను నియమించింది. నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు నితిన్ సింగ్ బదారియా , కందుకూరు, కావలి, ఉదయగిరికి రామ్ కుమార్ గౌతమ్, సర్వేపల్లికి కరీ గౌడ్ సాధారణ పరిశీలకులుగా నియమితులయ్యారు. పోలీస్ పరిశీలకులుగా కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఉదయగిరికి అశోక్ టి దూదే , సర్వేపల్లికి అరవింద్ సాల్వే ను నియమించింది.
నెల్లూరు జిల్లాలో జనసేనకు పట్టిన దరిద్రం పోయిందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిని వైసీపీ నాయకులు కలవడంతో సంబరాలు చేసుకున్నారు. మనుక్రాంత్ రెడ్డి జనసేనను వీడితే తమకు సంతోషమేనని.. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోమని హెచ్చరించారు. తర్వాత బాణసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు.
నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 20,48,252 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. వీరిలో 10,02,144 మంది పురుషులు, 10,45,917 మంది మహిళలు, 211 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించగా 7,932 పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. కొత్తగా ఓటు నమోదుకు ఈ నెల 14 వరకు దరఖాస్తులు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేసిన ఘటన మంగళవారం రాత్రి బెంగళూరు జాలహళ్లిలో పరిధిలో జరిగింది. నెల్లూరుజిల్లా ఉదయగిరి ప్రాంతానికి చెందిన గంగాదేవి తన ఇద్దరు పిల్లలు లక్ష్మీ (9), గౌతమ్(7)తో కలిసి బెంగళూరులో ఉంటోంది. నిద్ర పోతున్న బిడ్డల ముఖాలపై దిండు వేసి అదిమిపెట్టి హత్య చేసింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి.. తప్పు ఒప్పుకుంది. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి కొద్ది రోజులుగా రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో భాగంగా జిల్లాలో జనసేనకు ఎక్కడా పోటీ చేసే అవకాశం లభించలేదు. మొదట్లో కూటమికి సంబంధించిన కొన్ని సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ ఇటీవల ప్రచారంలో ఎక్కడా ఆయన ఊసే లేదు. ఈక్రమంలో ఆయన రాజకీయ కార్యాచరణపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా ఎయిర్‌పోర్ట్ విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి(VSR) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు దగాకోరు హామీల్లో నెల్లూరు ఎయిర్ పోర్టు ఒకటి. 2018లో దగదర్తి వద్ద ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించి 2020 నాటికి పూర్తి చేస్తామని నమ్మబలికారు. నేను ప్రామిస్ చేస్తున్నా. జగన్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎయిర్‌పోర్టు పనులు మొదలుపెట్టి 30 నెలల్లో పూర్తి చేస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
కోవూరులో పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. కోవూరు సచివాలయం-2 పరిధిలో పనిచేస్తున్న 29 మంది తమ రాజీనామా పత్రాన్ని సచివాలయం అధికారులకు అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించకుండా టీడీపీ ప్రభుత్వం చేసిన కుట్రలకు నిరసనగా తాము రాజీనామా చేశామన్నారు. తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకున్న తరువాత విధులలో చేరుతామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.