India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మూడు దశాబ్దాలుగా ప్రజా తీర్పు ఒకేలా ఉంటోంది. 1989, 91, 96, 98లో రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. 1999లో నెల్లూరులో టీడీపీ, తిరుపతి ఎంపీగా టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014, 19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను విజయం వరించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో.
భారత చైతన్య యువజన పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా కాళహస్తి చెంచు మహేశ్ బరిలో నిలవబోతున్నారు. ఈ మేరకు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో నెల్లూరు సిటీ అభ్యర్ధిగా చెంచు మహేశ్‌ను ప్రకటించారు.
చికెన్ ధరలు రోజురోజుకీ పెరుగుతుండడంతో వినియోగదారులు హడలిపోతున్నారు. మొన్నటివరకు 200 నుండి 220 రూపాయల వరకు పెరిగిన చికెన్ ధరలు మంగళవారం నాటికి 310 కి చేరుకుంది. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా చికెన్ దుకాణాల వద్ద వినియోగదారులు రద్దీగా ఉన్నప్పటికీ అధిక మోతాదులో చికెన్ విక్రయాలు జరగడంలేదని వ్యాపారస్థులు తెలిపారు.
చెల్లెలు వరుసైన కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డిపై నీచమైన రాజకీయాలు చేస్తున్న ప్రసన్న సోదరులను చూసి సభ్య సమాజం తలదించుకుంటోందని నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రసన్న సోదరుడు రాజేంద్రకు సంబంధించి అనేక ఆడియోలు ఉన్నాయని.. వాటిని బయటపెడితే ఆయన ఆసలు బయట ముఖం కూడా చూపించలేడని విమర్శలు గుప్పించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సోమవారం రాత్రి ఆత్మకూరు పట్టణంలో పర్యటించారు. అనంతరం పట్టణంలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దుస్తులను ఇస్త్రీ చేశారు. స్థానికులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని.. నెల్లూరు రూరల్ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే వారిని చంద్రబాబు కొనసాగిస్తారని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందమూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కోటంరెడ్డి మాట్లాడారు.
ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ సీపీఎం అభ్యర్థిగా మూలం రమేశ్‌కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, నెల్లూరు సిటీ నుంచి వైసీపీ బరిలోఎండీ ఖలీల్, కూటమి అభ్యర్థిగా పొంగూరు నారాయణ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చాకలికొండలో టీడీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేశ్‌కు మద్దతుగా ప్రచారం జరిగింది. ఇందులో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా జీతం తీసుకునే ఏ ఒక్కరూ ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గన్‌మెన్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.
గతంలో సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఇచ్చేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న సలహాదారుల నెల జీతం ఆపేస్తే పేద ప్రజలకు అన్ని కానుకలు పంపిణీ చేయవచ్చన్నారు. సోమవారం సాయంత్రం ఉప్పుటూరు, కందమూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రాణం ఉన్నంతవరకు తాను CM జగన్‌తోనే ఉంటానని వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR) అన్నారు. 35 ఏళ్లుగా జగన్ కుటుంబంతో ఉన్నానని.. ఇకపై కూడా ఉంటానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఆ కుటుంబంతో తన బంధం శాశ్వతమని పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతుల్లా తనకు వెన్నుపోటు పొడవడం, పార్టీలు మారడం తెలియదన్నారు. విడవలూరు రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Sorry, no posts matched your criteria.