India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పి K.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాలలో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ నగదు, మద్యం, నాటు సారా, గంజాయి మొదలగు ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు.
రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన నెల్లూరు- వేదాయపాలెం రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం జరిగింది. రైల్వే ఎస్సై మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పలు మండలాలలోని ప్రజలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌ను ప్రకటించింది. కలిగిరి 45.8, జలదంకి 45.0, కోవూరు44,1, మనుబోలు 44.8, వెంకటాచలం 44.6, సైదాపురం 42.7, తోటపల్లిగూడూరు42.0, వరికుంటపాడు 43.9, వింజమూరు 42.9, సూళ్లూరుపేట 44.7, తడ 40.5, పెళ్లకూరు 42.3, ఓజిలి 42.9, నాయుడుపేట 43.5, కోట 42.9, దొరవారిసత్రం 42.8, గూడూరు 44.8, చిల్లకూరు 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకూరుపేటకు చెందిన సుబ్బరత్నమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త మాట వినకుండా నిత్యం ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుండేది. ఈక్రమంలో శనివారం కూలి పనికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి తిరిగి రాలేదు. ఆదివారం కోడూరుపాడులోని టెంకాయతోటలో సుబ్బరత్నమ్మ మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
టీడీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు పార్లమెంట్‌కు 12 సార్లు(ఉప ఎన్నికలతో కలిపి) ఎన్నికలు జరిగాయి. 1983(ఉప ఎన్నిక), 1984లో పెంచలయ్య టీడీపీ ఎంపీగా విజయం సాధించారు. చివరగా 1999లో వుక్కల రాజేశ్వరమ్మ టీడీపీ తరఫున గెలిచారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బరిలో ఉన్నారు. మరి 25 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా టీడీపీ జెండా ఎగురుతుందేమో చూడాలి.
బ్లూ షర్ట్ వేసుకున్నానని వైసీపీ, పసుపు కండువా కప్పుకున్నానని టీడీపీ, రోజూ బొట్టు పెట్టుకుంటానని బీజేపీ అనొద్దని, తనకు రాజకీయాలు అంటగట్టొద్దని దివంగత ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మహానాయకులు , పెద్దనాయకులు చాలా మంది ఉన్నారన్నారు. నెల్లూరు కోటమిట్టలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొండాపురం మండలం పార్లపల్లి సమీపంలోని పొలాల్లో పొగాకు లోడుతో ఉన్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఆ సమయంలో ట్రాక్టర్ లో 15 మంది కూలీలు ఉన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాళ్లు వెంటనే కిందికి దూకి తృటిలో ప్రాణాలు కాపాడుకున్నారు. లోడుతో ఉన్న ట్రాక్టర్ పొలంలోంచి రోడ్డుపైకి ఎక్కిస్తుండగా అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు అక్కడున్న వారు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పర్యటించిన టీడీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. క్రీడాకారులతో పాటు వాకర్స్ వారిని చప్పట్లతో ప్రోత్సహించారు.
నెల్లూరు నగరంలో విద్యుత్ బకాయిలను వేగవంతం చేసి వంద శాతం వసూళ్లకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యుత్ శాఖ ఈఈ సోమశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 3 నెలలు బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్ తొలగించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో అదనపు లోడు అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు.
చేజర్ల మండలం కోటితీర్థం గ్రామంలో శనివారం కోటారెడ్డి అనే వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జలదంకి మండలం బ్రాహ్మణకాకు చెందిన ఇతను 5 ఏళ్లుగా కోటి తీర్ధంలోని వెంకయ్యస్వామి ఆశ్రమంలో జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా… మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రానట్లు స్థానికులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.