India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుత్తలూరు, గుంటూరుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయ. నర్రవాడకు చెందిన సత్యబాబు సౌదీలోని ఓ పారిశ్రామిక సంస్థలో ఇంజినీరుగా పని చేస్తున్నారు. భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అతని మామ గుంటూరుకు చెందిన రామారావు దంపతులు వారి వద్దకు విజిటింగ్ వీసాపై వెళ్లారు. విమానాశ్రయం నుంచి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోవూరు మీదుగా వెళ్లిన సందర్భంగా నల్లపరెడ్డి సోదరులు ఒకే చోట కనిపించారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజేంద్రకుమార్ రెడ్డి మాట్లాడిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ దశలో రాజేంద్ర రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సైతం జరిగింది. ఈ క్రమంలో అందరూ కలవడంపై నల్లపరెడ్డి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కావలిలో శనివారం జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులను సీఎం జగన్ పరిచయం చేశారు. ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, అబ్దుల్ ఖలీల్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, మధుసూదన్ యాదవ్ లను ఆశీర్వదించాలని కోరారు.
నెల్లూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శనివారం జబర్దస్త్ ఫేమ్ రియాజ్ కలిశారు. పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్ జగన్‌ను కలిశారు. కాగా రియాజ్ వైసీపీ దివ్యాంగుల నగర కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. రియాజ్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ముంబై జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ సీట్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికుల సహాయంతో బయటకి తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాలో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న బస్సు యాత్ర కోవూరు క్రాస్ రోడ్, సున్నపుబట్టి,తిప్ప, గౌరవరం మీదుగా ఆరేస్సార్ ఇంటర్నేషనల్ వద్దకు చేరుకొని కొద్దిసేపు భోజన విరామం ఉంటుంది. అనంతరం కావలి పరిధిలోని జాతీయ రహదారి వద్దకు చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
సీఎం జగన్ గురువారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. శనివారం ఉదయం వరకు ఇక్కడే ఉండనున్న జగన్ ఉమ్మడి నెల్లూరుతో పాటు కందుకూరు కలిపి 11/11 సీట్లలో విజయంపై జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వేమిరెడ్డి దంపతులతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసే స్థానాలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురూ వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారే.
మేమంతా సిద్ధం సభల్లో పాల్గొనేందుకు నెల్లూరుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చంద్రశేఖర్ రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారంపై ఆయనకు దిశానిర్దేశం చేశారు.
సార్వత్రిక ఎన్నికల పోరును అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు మించి ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. రాజకీయాలకు పరిచయమే లేని తమ కుటుంబ సభ్యులను కూడా అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దించేశారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు అభ్యర్థుల వారసులు ప్రచార పర్వంలో ఉండగా, తాజాగా వైసీపీ MP అభ్యర్థి విజయసాయి రెడ్డి భార్య సునంద కూడా నెల్లూరులో ప్రచారం చేస్తున్నారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరంతా ఒకప్పుడు CM జగన్‌కు నమ్మిన వ్యక్తులు. వీళ్లంతా TDP గూటికి చేరారు. ఇందులో వేమిరెడ్డి, కోటంరెడ్డి YCP అభ్యర్థులతో ఎన్నికల్లో తలపడనున్నారు. బస్సు యాత్రలో భాగంగా జగన్ నెల్లూరుకు వచ్చారు. ఇవాళ అంతా ఆయన నెల్లూరులోనే ఉంటారు. మరి ఆయా నేతలను ఎదుర్కొనేలా జగన్ ఆ పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి మరి.
Sorry, no posts matched your criteria.