India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు ప్రత్యేక ఏసీబీ కోర్టు, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సత్యవాణి అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. కడపలో పనిచేస్తున్న గీతను నెల్లూరు ప్రత్యేక మహిళా కోర్టు, 8వ అదనపు సెషన్స్ జడ్జిగా నియమించారు. నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీనారాయణను గుడివాడకు బదిలీ చేయగా, ఆయన స్థానంలో చిత్తూరు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న కరుణకుమార్ నియమితులయ్యారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. వారు ఎప్పుడైనా తనను నిర్భయంగా కలవవచ్చని నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు. నూతన ఎస్పీగా గురువారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఆరిఫ్ హఫీజ్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తొలి పోస్టింగ్‌లో నర్సీపట్నం ఏఎస్పీగా, అనంతరం రంపచోడవరం ఓఎస్డీగా పని చేశారు.
నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు ఎన్నికల శిక్షణా తరగతుల నిర్వహణతో అన్ని అంశాల్లో అవగాహన కల్పించామని రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ తెలిపారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, నెల్లూరు నగరంలోని స్థానిక డి.కె. మహిళా కళాశాలలో ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణలో అన్ని అంశాలపట్ల ఉత్తమ తర్ఫీదు ఇచ్చామని, సందేహాలకు తావులేకుండా మాస్టర్ ట్రైనర్స్ వివరించారని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో పోలింగ్ నిర్వహణకు 14, 945 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించామని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో ఎన్నికల పోలింగ్ అధికారులను కేటాయించడానికి మొదటి విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. 2, 900 మంది పోలింగ్ అధికారులు, 2,914 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 9,131 మంది ఇతర పోలింగ్ అధికారులు అని తెలిపారు.
రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. 2018 ఏప్రిల్ 3న ఆయన వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా అనేక అంశాలు, సమస్యలపై రాజ్యసభలో గళం వినిపించారు. ప్యానల్ వైస్ ఛైర్మన్‌గా సభను కూడా నడిపించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్ సభ బరిలోకి దిగబోతున్నారు.
నాయుడుపేటలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభ ముగిసింది. సభ వేదికపై సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. తిరుపతి జిల్లాలో పలువురు నాయకులను పరిచయం చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు నెల్లూరు చింతారెడ్డిపాలెం వద్ద బస చేస్తారు.
నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డిని ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాకు ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 8 గంటల లోపల బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది గుంటూరు ఎస్పీగా విధులు నిర్వహించి ఉన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు నమోదుకు ఈ నెల 14 వరకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 20,44,815 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్లు చెప్పారు. ఓటరు జాబితాలో ఏవైనా చిన్న తప్పులుంటే ఎన్నికల సంఘం సూచించిన 10 గుర్తింపు కార్డుల్లో దేన్నైనా చూపి ఓటు వేయవచ్చన్నారు.
గూడూరు బైపాస్ కూడలిలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే అతను మృతిచెందాడు. మృతుడు గూడూరు మండలం పోటుపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి ఏడుకొండలుగా గుర్తించారు. వెల్డింగ్ పనులు చేసుకుని జీవనం సాగించే అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలను ఒంటి పూట నిర్వహించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని పీడీ ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.