Nellore

News April 2, 2024

ఉదయగిరి: పింఛన్ కోసం పడిగాపులు కాసి వృద్ధుడు మృతి

image

ఉదయగిరి మండల పరిధిలోని కొండయ్యపాలెం పంచాయతీ వీరారెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన స్వర్ణ లక్ష్మయ్య అనే వృద్ధుడు మృతి చెందారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటింటికి తెచ్చి పెన్షన్లు అందజేస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లు వ్యవస్థను పక్కన పెట్టింది. దీంతో పెన్షన్ మీదే ఆధారపడే ఈ వృద్ధుడు ఉండబట్టలేక కొండాయపాలెం సచివాలయం వెళ్లి విచారించి తిరిగి ఇంటికి వచ్చే లోగా ప్రాణం వదిలారు.

News April 2, 2024

వెంకటగిరి: పింఛన్ కోసం వచ్చి వృద్ధుడు మృతి

image

తనకు రావాల్సిన పింఛను కోసం తిరుపతి నుంచి వెంకటగిరిలోని బంగారు పేటకు 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య వచ్చాడు. పింఛన్ విషయం కనుక్కునేందుకు ఎండలో సచివాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News April 2, 2024

నెల్లూరు: 123 మంది వాలంటీర్లు రాజీనామా

image

కావలి పట్టణంలోని వివిధ వార్డులకు సంబందించిన సుమారు 123 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కు సమర్పించారు. వారు మాట్లాడుతూ… మేమంతా తమకు అప్పగించిన విధులను నిర్వర్తించడం ద్వారా ఎంతో ఆత్మ సంతృప్తిని పొందామని, ప్రజల అభిమానం పొందడం గర్వ కారణంగా ఉందన్నారు. తమను విధుల నుంచి తొలగించడంలో టీడీపీ హస్తం ఉందని కొందరు అసహనం వ్యక్తం చేశారు.

News April 2, 2024

నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి బదిలీ

image

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

News April 2, 2024

ఉమ్మడి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీళ్లే..

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. * ఆత్మకూరు: చేవురు శ్రీధర్ రెడ్డి * కోవూరు: నెబ్రంబాక మోహన్ * నెల్లూరు రూరల్ షేక్ ఫయాజ్ * సర్వేపల్లి- పూల చంద్రశేఖర్ * గూడూరు (SC)- వేమయ్య చిల్లకూరి * సూళ్లూరుపేట (SC)- గడి తిలక్ బాబు * ఉదయగిరి- సోము అనిల్ కుమార్ రెడ్డి

News April 2, 2024

బంగారు చీరలో ముత్యాలమ్మ

image

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తూర్పుకనుపూరు ముత్యాలమ్మ జాతర  పోలేరమ్మ నిలుపుతో అట్టహాసముగా ప్రారంభమైనది. జాతరలో భాగంగా ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయమును వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి విచ్చేస్తున్నారు.

News April 2, 2024

నాయుడుపేటలో ఇద్దరు కత్తులతో దాడి

image

నాయుడుపేట బీడీ కాలనీలో ప్రసాద్ అనే వ్యక్తిపై మస్కుద్, మౌళి అనే ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ప్రసాద్‌ను గొంతుపై కత్తితో కోయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి వచ్చేసరికి మస్కుద్, మౌళి పరారయ్యారు. గాయపడిన ప్రసాద్‌ను నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2024

తిరుపతి జిల్లాకు రానున్న సీఎం జగన్

image

తిరుపతి జిల్లాలోని తడ, నాయుడుపేటలో ఈనెల 4న తేదీన సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సిద్ధం సభ ఏర్పాట్లను కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డితో పాటు పలువుర నాయకులు కలిసి సభాప్రాంగణాన్ని పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

News April 2, 2024

అనంతసాగరం: జాతీయ రహదారిపై లారీ బోల్తా

image

అనంతసాగరం మండలం ఉప్పలపాడు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు వైపు నుంచి బద్వేలు వైపు వెళ్తుండగా సిలికా లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు.

News April 2, 2024

బిట్రగుంట: SIకి జైలు శిక్ష

image

బోగోలుకు చెందిన వెంకటేశ్వరరావు గతంలో ఎస్సై వెంకటరమణ తీరుపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 2016 జూన్ 24న బిట్రగుంటలో టీ తాగుతుండగా ఎస్సై అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించారని బాధితుడు కోర్టును ఆశ్రయించారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్సై వెంకటరమణకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి తీర్పు చెప్పారు.

error: Content is protected !!