Nellore

News March 19, 2024

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవు: కలెక్టర్

image

రాజకీయ పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లు, ప్రభుత్వంలో పనిచేసే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ హెచ్చరించారు. ప్రభుత్వంలో పనిచేసేవారు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొంటున్నారని వివిధ పత్రికలలో వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు.

News March 19, 2024

సూళ్లూరుపేటలో టపాసుల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

image

సూళ్లూరుపేట హోలీక్రాస్ సర్కిల్ వద్ద ఉన్న టపాసుల గోడౌన్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టపాసులు తయారుచేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగసి పడ్డాయి. ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

జలదంకి: గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా

image

జలదంకి మండల పరిధిలోని చిన్న కాక వద్ద అదుపుతప్పి గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ లారీలోనే చిక్కుకుపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు రక్షించి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రిలో తరలించినట్లు స్థానికులు తెలిపారు.

News March 19, 2024

ఆత్మకూరు: మద్యం షాపులో రూ. 3.89 లక్షల చోరీ

image

ఆత్మకూరు పట్టణంలోని ఒక మద్యం దుకాణంలో నగదు చోరీకి గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాపు ఒక వైపు గోడకు రంద్రం వేసి లోనికి ప్రవేశించి దుకాణంలోని రూ. 3.89 లక్షల నగదు చోరీ చేశారు. ఉదయం దుకాణం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 19, 2024

వెంకటగిరి: వరకట్న వేధింపు కేసులో ఉపాధ్యాయునికి మూడేళ్ల జైలు

image

ప్రభుత్వ ఉపాధ్యాయుడైన చెవిరెడ్డి సుధాకర్ రెడ్డి 2011లో స్వప్నను పెళ్లి చేసుకున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని 2017లో ఆమె పోలీసులను ఆశ్రయించారు. విచారించిన వెంకటగిరి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించినట్లు ఏపీపీ ప్రకృతి కుమార్ తెలిపారు.

News March 19, 2024

నెల్లూరు: కొత్త స్కూటర్ ఇవ్వాలని కోర్టు ఆదేశం

image

నెల్లూరుకు చెందిన సురేశ్ బాబు 2022లో ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ కొన్నారు. మైలేజీ రాకపోగా పది రోజులకే సెన్సార్ పనిచేయలేదు. బ్రేకులు ఫెయిలయ్యాయి. మరమ్మతులు చేయాలని లేదా కొత్త స్కూటర్ ఇవ్వాలని పలుమార్లు బాధితుడు కోరినా కంపెనీ నుంచి స్పందించక పోవడంతో బాధితుడు  వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 45 రోజుల్లో కొత్త స్కూటర్ ఇవ్వడంతో పాటు రూ.5 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది.

News March 19, 2024

నెల్లూరు: ప్రత్యర్థులందరూ కొత్తముఖాలే..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులందరూ మారిపోయారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ముఖాముఖి తలపడిన నేతలెవరూ ఈసారి పరస్పరం పోటీపడే పరిస్థితి లేకుండాపోయింది. పోటీలో ఒకరు పాత వారే అయినప్పటికీ మరొకరు మాత్రం వారికి కొత్త ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. కొన్ని చోట్ల రెండూ కొత్తముఖాలే కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.

News March 18, 2024

ప్రత్యర్థులందరూ కొత్తముఖాలే..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులందరూ మారిపోయారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ముఖాముఖి తలపడిన నేతలెవరూ ఈసారి పరస్పరం పోటీపడే పరిస్థితి లేకుండాపోయింది. పోటీలో ఒకరు పాత వారే అయినప్పటికీ మరొకరు మాత్రం వారికి కొత్త ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. కొన్ని చోట్ల రెండూ కొత్తముఖాలే కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.

News March 18, 2024

కోవూరులో 62 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అవుతుందా?

image

నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ స్థానానికి 1962 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. అత్యధికంగా నల్లపరెడ్డి కుటుంబ సభ్యులే ఇక్కడ గెలిచారు. తాజా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రశాంతి రెడ్డి 62 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతుందేమో చూడాలి మరి..

News March 18, 2024

ప్రసన్నుడి బ్రహ్మోత్సవాల వివరాలు ఇలా..!

image

నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు గిరిప్రదక్షిణ, అంకురార్పణతో రేపు ప్రారంభం కానున్నాయి. 20న తిరుమంజనం, ధ్వజారోహణ, శేషవాహన సేవ, 21న హనుమంత సేవ, 22న ఉదయం మోహినీ ఉత్సవం, రాత్రికి గరుడసేవ, 23 ఉదయం మొక్కుబడులు, సాయంత్రం తెప్పోత్సవం, గజ వాహన సేవ, 24న ఉదయం కల్యాణం, సాయంత్రం రథోత్సవం, రాత్రికి అశ్వవాహన సేవ, 25న సాయంత్రం పుష్పయాగం, రాత్రి ఏకాంతసేవతో ఉత్సవాలు పూర్తవుతాయి.

error: Content is protected !!