India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఇన్‌ఛార్జ్ పోలంరెడ్డి దినేశ్ రెడ్డిని కాదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చంద్రబాబు ఖరారు చేశారు. అలకబూనిన పోలంరెడ్డి కచ్చితంగా కోవూరు నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో టీడీపీ పెద్దలు స్పందించి పోలంరెడ్డిని నిన్న విజయవాడలో చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఛైర్మన్, పార్టీ పదవి, 2027లో MLC హామీ ఇస్తానని పోలంరెడ్డికి హమీ ఇచ్చినట్లు సమాచారం.
ప్రతి సోమవారం నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నేడు రద్దు చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు విషయాన్ని గుర్తించి.. సహకరించాలని కోరారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,746 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 28,080 మంది రెగ్యులర్, 4,666 మంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 7 సమస్యాత్మక కేంద్రాలు(సీతారామపురం, నారాయణ రెడ్డిపేట, కలువాయి ఏ, బీ సెంటర్లు, సౌత్ మోపూరు, మర్రిపాడు, రేవూరు) గుర్తించారు. వీటిలో 4 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నెల్లూరు జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని డీఈఓ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలన్నారు. రోజూ ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ఆదివారం ఉదయం గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు ఆరోగ్య రాణి, సునీతతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
సంగం మండల కేంద్రంలోని వెంకయ్య స్వామి గుడి పక్కన ఉన్న దువ్వూరు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ వృద్దుడు మృతి చెందాడు. కాలువలో మృతదేహం ఉండటానికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామాకు తరలించారు. మృతుడు సంగంకి చెందిన సూరాయిపాలెం వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లా సంగం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీరాపేరు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగార్జున రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. ప్లాట్ ఫాం-1పై హెటెన్షన్ వైర్ తెగిపడింది. దీంతో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఘటన సమయంలో పట్టాలపై రైలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు.
తిరుపతి ఎంపీ తాను పోటీలో ఉంటానని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ఏ పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు రాలేదు. అయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగానైన పోటీలో ఉంటానని ఆయన తన అనుచరులకు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీ, జనసేన నాయకులతో కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.
నెల్లూరు జిల్లా అభ్యర్థుల్లో పలువురు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. నేదురుమల్లి(వెంకటగిరి), సంజీవయ్య(సూళ్లూరుపేట), ఆదాల (నెల్లూరు రూరల్), రామిరెడ్డి(కావలి), కాకాణి(సర్వేపల్లి), విక్రం రెడ్డి(ఆత్మకూరు) ఇంజినీరింగ్ చదివారు. ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఛార్టెర్డ్ అకౌంటెంట్. ప్రసన్న(కోవూరు), రాజగోపాల్ రెడ్డి(ఉదయగిరి), మురళీధర్(గూడూరు) డిగ్రీ పూర్తి చేయగా, ఖలీల్(నెల్లూరు సిటీ) ఇంటర్ చదివారు.
Sorry, no posts matched your criteria.