Nellore

News March 16, 2024

ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే

image

నెల్లూరు నగర శాసనసభ్యుడు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇప్పటికే ఆయన నరసరావుపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2008లో కార్పొరేటరుగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 19 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు.

News March 16, 2024

తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వేణుంబాక

image

ముత్తుకూరు మండలం తాళ్లపూడికి చెందిన వేణుంబాక విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక నేత. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడిన తర్వాత అనూహ్య పరిణామాల మధ్య నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన విజయసాయి రెడ్డి అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. ఆయన ప్రత్యర్థిగా వేమిరెడ్డి ఉన్నారు.

News March 16, 2024

తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖలీల్

image

నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆయనను నెల్లూరు సిటీ అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు నగరంలోని అతి సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఖలీల్ అహ్మద్ అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇప్పటికే నెల్లూరులో ఖలీల్ అహ్మద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!