Nellore

News April 5, 2024

నెల్లూరు: CM జగన్ ఏం చెప్పనున్నారు?

image

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరంతా ఒకప్పుడు CM జగన్‌కు నమ్మిన వ్యక్తులు. వీళ్లంతా TDP గూటికి చేరారు. ఇందులో వేమిరెడ్డి, కోటంరెడ్డి YCP అభ్యర్థులతో ఎన్నికల్లో తలపడనున్నారు. బస్సు యాత్రలో భాగంగా జగన్ నెల్లూరుకు వచ్చారు. ఇవాళ అంతా ఆయన నెల్లూరులోనే ఉంటారు. మరి ఆయా నేతలను ఎదుర్కొనేలా జగన్ ఆ పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి మరి.

News April 5, 2024

నెల్లూరు: న్యాయమూర్తుల బదిలీ

image

నెల్లూరు ప్రత్యేక ఏసీబీ కోర్టు, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సత్యవాణి అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. కడపలో పనిచేస్తున్న గీతను నెల్లూరు ప్రత్యేక మహిళా కోర్టు, 8వ అదనపు సెషన్స్ జడ్జిగా నియమించారు. నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీనారాయణను గుడివాడకు బదిలీ చేయగా, ఆయన స్థానంలో చిత్తూరు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న కరుణకుమార్ నియమితులయ్యారు.

News April 5, 2024

బాధ్యతలు స్వీకరించిన నెల్లూరు ఎస్పీ

image

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. వారు ఎప్పుడైనా తనను నిర్భయంగా కలవవచ్చని నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు. నూతన ఎస్పీగా గురువారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఆరిఫ్ హఫీజ్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తొలి పోస్టింగ్‌లో నర్సీపట్నం ఏఎస్పీగా, అనంతరం రంపచోడవరం ఓఎస్డీగా పని చేశారు.

News April 5, 2024

‘ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని అంశాలపై అవగాహన’

image

నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు ఎన్నికల శిక్షణా తరగతుల నిర్వహణతో అన్ని అంశాల్లో అవగాహన కల్పించామని రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ తెలిపారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, నెల్లూరు నగరంలోని స్థానిక డి.కె. మహిళా కళాశాలలో ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణలో అన్ని అంశాలపట్ల ఉత్తమ తర్ఫీదు ఇచ్చామని, సందేహాలకు తావులేకుండా మాస్టర్ ట్రైనర్స్ వివరించారని తెలిపారు.

News April 4, 2024

పోలింగ్ నిర్వహణకు 14,945 మంది సిబ్బంది

image

నెల్లూరు జిల్లాలో పోలింగ్ నిర్వహణకు 14, 945 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించామని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో ఎన్నికల పోలింగ్ అధికారులను కేటాయించడానికి మొదటి విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. 2, 900 మంది పోలింగ్ అధికారులు, 2,914 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 9,131 మంది ఇతర పోలింగ్ అధికారులు అని తెలిపారు.

News April 4, 2024

మాజీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

image

రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. 2018 ఏప్రిల్ 3న ఆయన వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా అనేక అంశాలు, సమస్యలపై రాజ్యసభలో గళం వినిపించారు. ప్యానల్ వైస్ ఛైర్మన్‌గా సభను కూడా నడిపించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్ సభ బరిలోకి దిగబోతున్నారు.

News April 4, 2024

నాయుడుపేటలో ముగిసిన జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ

image

నాయుడుపేటలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభ ముగిసింది. సభ వేదికపై సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. తిరుపతి జిల్లాలో పలువురు నాయకులను పరిచయం చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు నెల్లూరు చింతారెడ్డిపాలెం వద్ద బస చేస్తారు.

News April 4, 2024

నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్ నియామకం

image

నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డిని ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాకు ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 8 గంటల లోపల బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది గుంటూరు ఎస్పీగా విధులు నిర్వహించి ఉన్నారు.

News April 4, 2024

నెల్లూరు: ఈనెల 14 వరకు అవకాశం

image

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు నమోదుకు ఈ నెల 14 వరకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 20,44,815 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్లు చెప్పారు. ఓటరు జాబితాలో ఏవైనా చిన్న తప్పులుంటే ఎన్నికల సంఘం సూచించిన 10 గుర్తింపు కార్డుల్లో దేన్నైనా చూపి ఓటు వేయవచ్చన్నారు.

News April 4, 2024

గూడూరులో రోడ్డు ప్రమాదం

image

గూడూరు బైపాస్ కూడలిలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే అతను మృతిచెందాడు. మృతుడు గూడూరు మండలం పోటుపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి ఏడుకొండలుగా గుర్తించారు. వెల్డింగ్ పనులు చేసుకుని జీవనం సాగించే అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

error: Content is protected !!