Nellore

News October 26, 2024

తడలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

తడ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు మాంబట్టు సెజ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న వరదయ్యపాలెం గ్రామానికి చెందిన ప్రభాకర్‌గా పోలీసులు గుర్తించారు. ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 26, 2024

కాకాణిని కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి శుక్రవారం నెల్లూరులో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకాణిని సత్కరించారు. జిల్లాలో వైసీపీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. కాకాణికి ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు.

News October 25, 2024

నెల్లూరు జిల్లాలో 2,594 గృహాలకు రూ.6.43 కోట్లు విడుదల

image

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలోని 2,594 గృహాల నిర్మాణం కోసం రూ.6.43 కోట్ల నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆత్మకూరు 238, కందుకూరు 312, కావలి 460, కోవూరు 322, నెల్లూరు సిటీ 24, నెల్లూరు రూరల్ 88, సర్వేపల్లి 510, ఉదయగిరి 544, వెంకటగిరి 94 గృహాలకు బిల్డింగ్ సామాగ్రి చెల్లింపుల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. మార్చి 2025లోపు నిర్మాణాలు పూర్తి కావాలన్నారు.

News October 25, 2024

నెల్లూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

image

అనంతసాగరం మండలం నల్లరాజుపాలెం వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి సోమశిల ఉత్తర కాలువలో బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఆత్మకూరుకు చెందిన ట్రాక్టర్ మెకానిక్ సాదిక్ అలియాస్ బాబుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 25, 2024

పోలీసు సమస్యల పరిష్కారమే లక్ష్యం: నెల్లూరు జిల్లా ఎస్పీ

image

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జి.కృష్ణ కాంత్ తెలిపారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 15 మంది పోలీసుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ట్రాన్స్‌ఫర్లు, రిక్వెస్ట్‌లు, మెడికల్ సమస్యలను వారు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.

News October 25, 2024

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు

image

మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్‌లు పెడుతున్నారని, నిన్న ముత్తుకూరు మండల టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 25, 2024

కావలిలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

కావలి రూరల్ గౌరవరం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ధనియాల విజయ్ కుమార్ మృతి చెందారు. మరో విద్యార్థి బుట్ట విజయకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గౌరవరం నుంచి బైక్‌పై బిట్రగుంటకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ నుంచి జారిపడి విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి కలువాయి ప్రాంతం వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 25, 2024

ఉదయగిరి: తప్పిపోయిన విద్యార్థి తల్లిదండ్రులకు అప్పగింత

image

ఉదయగిరి:  దుర్గంపల్లి గ్రామానికి చెందిన గుమ్మళ్ల దశరథ ఈనెల 21 ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించడంలేదని తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆచూకీ కోసం గాలిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం బద్వేలు ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. దీంతో ఆ విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

News October 24, 2024

నెల్లూరు అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్

image

అయ్యప్పస్వామి భక్తుల కోసం IRCTC తొలిసారిగా భారత్ గౌరవ్ రైలును తీసుకొచ్చిందని నెల్లూరు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు నవంబర్ 16న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా శబరిమల చేరుకుంటుందని అన్నారు. 5 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రకు స్లీపర్ క్లాస్ అయితే రూ.11,475, థర్డ్ ఏసీ రూ.18,790 ఛార్జీగా నిర్ణయించారని, భక్తులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

News October 24, 2024

మనుబోలు హైవేపై ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మనుబోలు జాతీయ రహదారిపై నేడు జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. యాచవరానికి చెందిన కుడుముల మల్లికార్జున బైక్ మీద వెళుతుండగా నెల్లూరు వైపు నుంచి చెన్నై వెళుతున్న ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆయనకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మనుబోలు SI కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.