Nellore

News March 28, 2024

శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు ఇస్తున్న ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరి నారాయణన్ గురువారం పరిశీలించారు. ట్రైనింగ్ కు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని R.O, ARO లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

News March 28, 2024

మెట్టుకూరు మెట్టు దిగేనా !

image

వెంకటగిరి నియోజకవర్గ రాజకీయాల్లో వైసీపీ సీనియర్ నేత, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల వెంకటగిరిలో పెద్దసంఖ్యలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించడంతో పాటు కచ్చితంగా పోటీలో ఉంటానని రాజకీయ కాక రేపారు. ఈ క్రమంలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపురావడంతో వెళ్లారు. కీలక నేతలు సుదీర్ఘంగా మంతనాలు సాగించినా ఆయన మెత్తబడలేదని సమాచారం.

News March 28, 2024

నెల్లూరులో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ సినిమా బ్రోచర్ ఆవిష్కరణ

image

నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ సినిమా బ్రోచర్ ను విడుదల చేశారు. ఎస్‌వి‌ఎస్‌ఆర్ ప్రొడక్షన్‌లో ఈ చిత్రం నిర్మాణమవుతుండగా ‘మైండ్ గేమ్’ హీరో శ్రీరామ్ మరోసారి హీరోగా నటిస్తున్నారు. శ్రీకృష్ణ కిషోర్ చిత్రానికి దర్శకుడుగా మిధున ప్రియతో పాటు పలువురు నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, మహేంద్ర, వాసు, శోభన్ బాబు పాల్గొన్నారు.

News March 28, 2024

సర్వేపల్లిలో మూడో ఛాన్స్ ఎవరికో !

image

సర్వేపల్లిలో ఇప్పటి వరకు ఏ నాయకుడికీ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం రాలేదు. సీవీ శేషారెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం 2వసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మరోమారు కాకాణి, సోమిరెడ్డి ముఖాముఖి తలపడబోతున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా మూడో ఛాన్స్ కొట్టేసినట్టే .

News March 28, 2024

ఏప్రిల్ 1 నుంచి మెమూ రైళ్ల పునరుద్ధరణ

image

బిట్రగుంట – విజయవాడ, బిట్రగుంట – చెన్నై మధ్య నడిచే మెమూ రైళ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రెండు రైళ్లను ఇప్పటికే పునరుద్ధరణ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే అభివృద్ధి కమిటీకి కూడా సమాచారం పంపారు.

News March 28, 2024

నెల్లూరు నగరంలో దారుణ హత్య

image

నెల్లూరు నగరంలో బుధవారం సాయంత్రం ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. నగరంలోని వేణుగోపాల్‌ నగర్‌లో నాగూరు ఆదిశేషయ్య, మస్తానమ్మ కాపురం ఉంటున్నారు. వీరికి కుమారుడు వెంకటేశ్, కుమార్తెలు సునీత, దివ్య ఉన్నారు. సునీతకు సురేష్‌తో వివాహమయ్యింది. సునీతకు చంటి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో చంటి మస్తానమ్మను సునీత ఇంటికి తీసుకొచ్చాడు. వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు.. మస్తానమ్మను గొంతు కోసి హత్య చేశారు.

News March 28, 2024

నెల్లూరు: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

నెల్లూరు జిల్లా, కందుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పాలకొల్లు నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

image

వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ ఆపుకొని టైర్లలో గాలి చెక్ చేస్తున్నాడు. అదే సమయంలో మినీ లారీ వ్యాను వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ఘటనా స్థలానికి ఉదయగిరి సిఐ గిరిబాబు, ఎస్సై తిరపతయ్య చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 28, 2024

వ్యక్తిగత విమర్శలు చేయవద్దు: నెల్లూరు కలెక్టర్

image

ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయకుండా, ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని కలెక్టర్ కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. బుధవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ ను ప్రతి ఒక్కను పాటించాలన్నారు.

News March 27, 2024

నెల్లూరు: ప్రచారంలో నేతల వారసులు 

image

నెల్లూరులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొన్ని చోట్ల నేతల వారసులు ప్రచారంలో  మెరుస్తున్నారు. నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్ భార్య, నారాయణ భార్య, కుమార్తెలు, రూరల్‌లో కోటంరెడ్డి కుటుంబసభ్యులు, కోవూరులో ప్రశాంతిరెడ్డి కుమారుడు, కుమార్తె, నల్లపరెడ్డి కుమారుడు, సర్వేపల్లిలో కాకాణి కుమార్తె, సోమిరెడ్డి కుమారుడు, కోడలు, గూడూరులో పాశం భార్య ప్రచారంలో నిమగ్నమయ్యారు.

error: Content is protected !!