India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. రాపూరు మండలం గోనుపల్లికి చెందిన ఓ యువతి పొదలకూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో ఇవాళ విద్యార్థిని విష ద్రావకం తాగింది. గమనించిన స్థానికులు పొదలకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉదయగిరి నియోజకవర్గంలో సీతారామపురంలో గురువారం వైసీపీ అభ్యర్థులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వేణుంబాక విజయసాయి రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఎల్.వీ.ఆర్ కళాశాల వద్ద నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. వైసీపీని వాడుకుని వదిలేసిన నాయకులకు ఘన విజయంతో గుణపాఠం చెప్పాలని విజయసాయి రెడ్డి కోరారు.
మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ క్యాంప్ సైట్ లో ఇద్దరు నాయకుల మధ్య చర్చలు జరిగాయి. వైసీపీలో చేరాలని విష్ణును జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని విష్ణు స్పష్టం చేశారు. విష్ణు తీసుకునే నిర్ణయం కోసం ఆయన అనుచరగణం ఎదురుచూస్తోంది.
ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు ఇస్తున్న ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరి నారాయణన్ గురువారం పరిశీలించారు. ట్రైనింగ్ కు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని R.O, ARO లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వెంకటగిరి నియోజకవర్గ రాజకీయాల్లో వైసీపీ సీనియర్ నేత, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల వెంకటగిరిలో పెద్దసంఖ్యలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించడంతో పాటు కచ్చితంగా పోటీలో ఉంటానని రాజకీయ కాక రేపారు. ఈ క్రమంలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపురావడంతో వెళ్లారు. కీలక నేతలు సుదీర్ఘంగా మంతనాలు సాగించినా ఆయన మెత్తబడలేదని సమాచారం.
నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ సినిమా బ్రోచర్ ను విడుదల చేశారు. ఎస్‌విఎస్‌ఆర్ ప్రొడక్షన్‌లో ఈ చిత్రం నిర్మాణమవుతుండగా ‘మైండ్ గేమ్’ హీరో శ్రీరామ్ మరోసారి హీరోగా నటిస్తున్నారు. శ్రీకృష్ణ కిషోర్ చిత్రానికి దర్శకుడుగా మిధున ప్రియతో పాటు పలువురు నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, మహేంద్ర, వాసు, శోభన్ బాబు పాల్గొన్నారు.
సర్వేపల్లిలో ఇప్పటి వరకు ఏ నాయకుడికీ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం రాలేదు. సీవీ శేషారెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం 2వసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మరోమారు కాకాణి, సోమిరెడ్డి ముఖాముఖి తలపడబోతున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా మూడో ఛాన్స్ కొట్టేసినట్టే .
బిట్రగుంట – విజయవాడ, బిట్రగుంట – చెన్నై మధ్య నడిచే మెమూ రైళ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రెండు రైళ్లను ఇప్పటికే పునరుద్ధరణ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే అభివృద్ధి కమిటీకి కూడా సమాచారం పంపారు.
నెల్లూరు నగరంలో బుధవారం సాయంత్రం ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. నగరంలోని వేణుగోపాల్ నగర్‌లో నాగూరు ఆదిశేషయ్య, మస్తానమ్మ కాపురం ఉంటున్నారు. వీరికి కుమారుడు వెంకటేశ్, కుమార్తెలు సునీత, దివ్య ఉన్నారు. సునీతకు సురేష్‌తో వివాహమయ్యింది. సునీతకు చంటి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో చంటి మస్తానమ్మను సునీత ఇంటికి తీసుకొచ్చాడు. వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు.. మస్తానమ్మను గొంతు కోసి హత్య చేశారు.
నెల్లూరు జిల్లా, కందుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పాలకొల్లు నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.