India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఉపసమనం పొందేందుకు పుచ్చకాయల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న వ్యాపారులు కిలో 25 రూపాయలు చొప్పున కాయ సైజును బట్టి రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితిలో ప్రజలు అధిక రేట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళుతున్నారు.
ఉదయగిరి మండలంలో ఏప్రిల్ 3 నుంచి 8వ తేదీ వరకు సచివాలయ సిబ్బంది వితంతు వృద్ధాప్య దివ్యాంగ తదితర పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఎంపీడీవో డి.ఈశ్వరమ్మ తెలిపారు. మండలంలో 194 మంది వాలంటీర్లు ఉండగా వారి నుంచి మొబైల్ సిమ్ బయోమెట్రిక్ యంత్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
నెల్లూరు నగరం కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయంలో 2024 -25 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శంకరయ్య తెలిపారు. ఒకటో తరగతిలో 64 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. సీట్ల కోసం ఏప్రిల్ 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు కేంద్రీయ విద్యాలయం వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు.
కోవూరు మండలంలోని పడుగుపాడు రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి సుమారు 55 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది.కావలి జీఆర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతుడి చొక్కాపై విజయలక్ష్మి టైలర్,గాంధీపార్కు,కోవూరు అని రాసి ఉందని,స్థానికుడిగా భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
నెల్లూరు ఆనం కార్యాలయంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి విశ్వరూప చారి, విద్యార్ది విభాగానికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం. రామనారాయణ రెడ్డి, యువనేత ఆనం రంగమయూర్ రెడ్డితోనే మా ప్రయాణమని అన్నారు. టీడీపీతో కలిసి పనిచేయటానికి, మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావటానికి కృషి చేస్తానని అన్నారు.
నేడు 50 మండలాల్లో వడగాల్పులు రేపు 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ అధికారి కూర్పునాథ్ తెలిపారు. శుక్రవారం 36 మండలాల్లో వడగాల్పులు కడప జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
ఉదయగిరి పట్టణంలోని సికిందర్ పిక్చర్ ప్యాలెస్ ఎదుట సినీ వీక్షకులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. డీజే టిల్లు- 2 చిత్రం చూసేందుకు వచ్చిన వీక్షకులకు అసౌకర్యానికి గురై నిర్వాహకులతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చిత్రం ప్రసార సమయంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వీక్షకులు ఆందోళన చేపట్టారు. అనంతరం మూకుమ్మడిగా టికెట్ ఇచ్చి తిరిగి డబ్బులు తీసుకుని వెనుతిరిగారు.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జయసూర్య, హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్బారెడ్డిని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్థానిక జిల్లా కోర్టు కాంప్లెక్‌లో జిల్లా న్యాయ అధికారుల వర్క్ షాష్‌కు న్యాయమూర్తులు హాజరయ్యారు.
నాయుడుపేట పట్టణంలో ఏప్రిల్ 4వ తేదీన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి సభ ఏర్పాట్లను పరిశీలించారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ సభకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి 15వేల మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని పలు ప్రభుత్వ మహిళా కళాశాలలో అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.