Nellore

News July 7, 2024

మనుబోలు: రోడ్డు ప్రమాదంలో యువకుడిమృతి

image

కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఓ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. గూడూరు బాలాజీ నగర్‌కు చెందిన మనుబోలు సురేశ్ రెడ్డి ఉద్యోగం కోసం తన స్నేహితుడు పి.ప్రశాంత్‌తో కలిసి కృష్ణ పట్నం పోర్టుకు ఆదివారం బైక్ పై బయలుదేరాడు. కొమ్మలపూడి క్రాస్ రోడ్డు వద్ద బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 7, 2024

నెల్లూరు: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

image

రైలులో నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగింది. గాంధీనగర్‌లో నివాసముంటున్న నసీర్ నాయుడుపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం నాయుడుపేట నుంచి హైదరాబాద్ ఎక్స్ ప్రెస్‌లో నెల్లూరుకు బయలుదేరాడు.  వేదాయపాళెం రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

News July 7, 2024

నిత్యపూజా విధానంతో మనిషి ధర్మం వైపు: బ్రహ్మశ్రీ చాగంటి

image

నిత్యం పూజ విధానంతో మనుషులు ధర్మం వైపు నడుస్తారని బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం జరిగిన నిత్య పూజా విధానం కార్యక్రమంలో పాల్గొని ప్రవచనం చేశారు. మనిషి దేవుడు పట్ల ఎప్పుడు కృతజ్ఞతలు ఉండాలని సూచించారు. భగవంతుడు సృష్టించిన పంచేంద్రియాలను సక్రమంగా వినియోగించుకొని ధర్మం వైపు నడవాలని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News July 6, 2024

13న సోమశిలకు ముగ్గురు మంత్రులు

image

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని 13వ తేదీన ముగ్గురు మంత్రులు సందర్శించనున్నారు. నెల్లూరులోని సంతపేటలో గల ఆనం నివాసంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మంత్రులు ఆనం, నారాయణ విచ్చేయనున్నారు. ప్రాజెక్టు వద్ద దెబ్బతిన్న ప్రాంతాలను, సోమేశ్వర ఆలయాన్ని సందర్శిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

News July 6, 2024

మంత్రి నారాయణతో గూడూరు ఎమ్మెల్యే భేటీ

image

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఏపీ మంత్రి నారాయణతో నెల్లూరులోని ఆయన నివాసంలో భేటి అయ్యారు. నెల్లూరు జిల్లాలోని పలు అంశాలు, గూడూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే మంత్రితో చర్చించారు. ఈ కార్యక్రమంలో సునీల్ కుమార్ తో పాటు మంత్రి ఆనం, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News July 6, 2024

కోవూరు: గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం

image

కోవూరు: సాలుచింతల సమీపంలోని ముళ్లపొదల్లో వృద్ధురాలి మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. శనివారం ఉదయం పొదల వద్ద నుంచి దుర్వాసన వస్తుండడంతో అటుగా వెళ్లి స్థానిక యువకులు చూడగా మహిళ మృతదేహం కనిపించింది. మహిళ మృతిచెంది నాలుగు రోజులు అయ్యి ఉంటుందని, శరీరం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు తెలిపారు. నెల్లూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

ఉదయగిరిలో పులుల సంచారంతో వణుకు

image

ఉదయగిరిలోని వెలుగొండ అడవుల్లో పెద్దపులి, చిరుత పులి సంచరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల దుర్గం రిజర్వు ఫారెస్టులో మేక చనిపోవడంతో..పులి చంపిందంటూ స్థానికులు చెప్పారు. కానీ మేకను కుక్కలు చంపాయంటూ అధికారులు కొట్టిపడేశారు. పున:పరిశీలించిన తర్వాత పులలేనని తేల్చారు. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు తెలిపారు.

News July 6, 2024

గూడూరు: ఈ నెల 15 నుంచి పలు మెము రైళ్లు రద్దు

image

నిర్వహణ పనుల నిమిత్తం పలు మెము రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ నుంచి గూడూరుకు వచ్చే 07500, 12744 రైళ్లు ఈ నెల 15 నుంచి 30 వరకు, గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 07458, 12743 రైళ్లు ఈనెల 16 నుంచి 31 వరకు రద్దయ్యాయి. గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 17259, విజయవాడ నుంచి గూడూరు వెళ్లే 17260 రైళ్లను 16, 23, 30 తేదీలలో నిలిపివేసినట్లు తెలిపారు.

News July 6, 2024

నెల్లూరు: ఎస్సీ కార్పొరేషన్ ఈఓ సస్పెండ్

image

ఎస్సీ కార్పొరేషన్ ఈఓ సెల్విని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్లో కొన్ని రకాల ఉద్యోగోన్నతుల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన గత నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ ఉన్నతాధికారులకు నివేదికను పంపారు. దీంతో ఈఓపై సస్పెన్షన్ వేటు పడింది.

News July 6, 2024

నెల్లూరు: భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారం

image

భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారం చేసిన ఘటన టీపీ గూడూరులో జరిగింది. పోలీసుల వివరాలు.. టీపీ గూడూరుకు చెందిన మహిళకు ఇదివరకే వివాహమవ్వగా ఆమెకు కూతురు, కొడుకు ఉన్నారు. భర్తతో విభేదాలు వచ్చి కనిగిరికి చెందిన కె.మల్లిఖార్జునను చేసుకుంది. వీరికి కూడా గొడవలు రావడంతో జూన్ 29న స్కూలుకు వెళ్లి.. దుస్తులు కొనిస్తానని భార్య కుమార్తెను బైకుపై బల్లిపల్లి అడవిలోకి తీసుకువెళ్లాడు. రెండురోజుల పాటు అత్యాచారం చేశాడు.