India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొత్తిళ్లలో ఉండాల్సిన బాలుడిని బస్టాండులో వదిలేసి వెళ్లిన ఘటన నెల్లూరులో జరిగింది. మంగళవారం రాత్రి బస్సు కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు విద్యార్థులకు ఓ మహిళ పసికందును అప్పగించి బాత్రూంకి వెళ్లి వస్తానని చెప్పి అటునుంచి అటే వెళ్లిపోయింది. ఎంత సేపటికీ రాకపోవడంతో విద్యార్థులు ఆ బిడ్డను ఆర్టీసీ డీఎం, ఓ లాయర్ సహాయంతో శిశు గృహానికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్‌ను సక్రమంగా అమలు చేసేందుకు ఆయా శాఖలు ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో సబ్ ప్లాన్ అమలుకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్టీల కోసం ప్రభుత్వం శాఖల వారీగా నిధులు కేటాయిస్తుందన్నారు. STల ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు.
విజయవాడలో వరద ఉద్ధృతి తగ్గుతోందని మంత్రి నారాయణ అన్నారు. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలువల్లో పెద్దఎత్తున పూడిక పేరుకుపోయిందని, రోడ్లపైన భారీగా మట్టి, ఇసుక చేరిందన్నారు. ముంపు ప్రాంతాల్లోని బాధితులను బయటకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు 10 వేల మంది కార్మికులు అవసరమని అన్నారు. వరద ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.
నెల్లూరులోని శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. గణేష్ ఘాట్ లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగేందుకు ఉత్సవ కమిటీలు, శాంతి కమిటీల సభ్యులు సమన్వయంతో పనిచేసి పోలీసులకు సహకరించాలని కోరారు.
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల కేంద్రంలోని గండువారి పల్లి స్కూల్లో క్షుద్ర పూజలు కలకలం రేపింది. ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేసిన ఘటనను చూసి భయాందోళన గురయ్యారు. దీంతో విద్యార్థులు స్కూల్లోకి వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో వాత్సల్య పథకం ద్వారా నెల్లూరు, కందుకూరులో ఉన్న బాలసదన్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను తాత్కాలిక పద్దతిలో భర్తీ చేస్తున్నట్లు PD హేనా సుజన్ తెలిపారు. వంట, సహయకులు, రాత్రి వాచ్‌మెన్, క్రీడా శిక్షకురాలు, యోగా, పాఠాల బోధన, క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ICDS కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
నెల్లూరు నగరంలోని ముత్యాలపాలెంలో పౌల్ (35) అనే వ్యక్తిని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి చంపేశారు. బిట్రగుంటకు చెందిన సుమారు 10 మంది ఈ హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ సాంబశివరావు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
సింహపురి ఎక్స్‌ప్రెస్ మహబూబాబాద్‌లో ఆగిపోవడంతో సర్వేపల్లి MLA సోమిరెడ్డి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లో ఆతిథ్యం పొందారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మంకు బయలుదేరగా మార్గమధ్యలో రైలు నిలిచిపోయింది.దీంతో కారు, బైకులపై ఖమ్మంకు చేరుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో బసచేశారు. అనంతరం కారులో హైదరాబాద్‌కు చేరుకున్నారు.
నెల్లూరు జిల్లాకి చెందిన మహిళ వరదల్లో చిక్కుకుని మృతి చెందింది. లింగసముద్రం(M), మెగిలిచర్లకు చెందిన S. వరలక్ష్మి(38) ఇటీవల విజయవాడలోని వాంబే కాలనీలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. శనివారం కాలనీని వరద చుట్టుముట్టింది. ప్రాంతంలోని నివాసాలన్నీ నీట మునిగాయి. వారు ఉంటున్న ఇంట్లోకి వరదనీరు చేరడంతో ఆమె అందులో చిక్కుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జిల్లాలో బలహీనంగా ఉన్న చెరువులు, కాలువ కట్టలకు వెంటనే మరమ్మతులు చేసి భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యూటేషన్లు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు తదితర వాటిపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
Sorry, no posts matched your criteria.