Nellore

News July 3, 2024

జగన్ నెల్లూరు పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్‌ను మాజీ మంత్రి కాకాణి వెల్లడించారు. ఉదయం 9.40 గంటలకు జగన్ తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరుతారు. 10.30 గంటలకు నెల్లూరు పోలీసు పరేడ్ మైదానానికి చేరుకుంటారు. రోడ్డు మార్గాన జైలుకు వెళ్లి.. తిరిగి 12 గంటలకు పోలీసు పరేడ్ మైదానానికి చేరుకుని తాడేపల్లికి వెళ్తారు.

News July 3, 2024

నెల్లూరు: బస్సులో రూ.80 లక్షల చోరీ

image

బస్సులోనే మత్తు పెట్టి భారీగా నగదు చోరీ చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. విజయవాడ నుంచి ఇద్దరు వ్యాపారులు రూ.80 లక్షలతో బెంగళూరుకు బయల్దేరారు. కావలి సమీపంలోని మద్దూరుపాడు దాబా వద్ద భోజనానికి ఆపారు. ఇందులో ఒకరు దాబాలో తిని మరొకరికి పార్శిల్ తీసుకు రావడానికి వెళ్లారు. బస్సులో ఉన్న దొంగలు అతడికి మత్తు పెట్టి అతని వద్ద ఉన్న రూ.80 లక్షల డబ్బు సంచి తీసుకుని రోడ్డు దాటుకుని మరొక వాహనంలో పరారయ్యారు.

News July 3, 2024

APSPDCL యాప్, వెబ్సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించండి

image

నెల్లూరు జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ఏపీఎస్పీడీసీఎల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఎస్‌ఈ వి విజయన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు ఇకపై వినియోగదారులు వివిధ రకాల యూపీఐ పేమెంట్లు ద్వారా నేరుగా బిల్లులు చెల్లించకూడదన్నారు. యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి తద్వారా లింక్ చేయబడిన యూపీఐ ద్వారానే బిల్లులు చెల్లించాలన్నారు.

News July 2, 2024

నాడు గూడూరు సబ్ కలెక్టర్.. నేడు నెల్లూరు కలెక్టర్

image

ఇవాళ నెల్లూరు కలెక్టర్ గా నియమితులైన ఓ.ఆనంద్ గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ గా పనిచేశారు. 2018 వ సంవత్సరం నుంచి సుమారు ఒకటిన్నర సంవత్సరం గూడూరు సబ్ కలెక్టర్ గా పనిచేశారు. ఈయన పనిచేసిన కాలంలో గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నో భూ సమస్యలకు పరిష్కారం చూపినట్లు గూడూరు ప్రజలు గుర్తు చేసుకున్నారు. గూడూరు సబ్ కలెక్టర్.. నెల్లూరు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందని ప్రజలు అంటున్నారు.

News July 2, 2024

నెల్లూరు: R&B అధికారులకు మంత్రి ఆదేశాలు

image

ఆత్మకూరులో R&B అతిథి భవనాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. భవనాలు అసంపూర్తిగా ఉండడంతో అవసరమైన వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, టీడీపీ నాయకులు గిరునాయుడు తదితరులు ఉన్నారు.

News July 2, 2024

నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఓ.ఆనంద్

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఓ.ఆనంద్ నియామకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన నెల్లూరు కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News July 2, 2024

కావలి ప్రమాదం తీవ్రంగా కలచివేసింది: మంత్రి సత్యకుమార్ యాదవ్

image

కావలి వద్ద స్కూల్‌ బస్సును లారీ ఢీకొనడంతో 15 మంది చిన్నారులు గాయపడటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందడం బాధాకరమని, గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి DM&HO నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నానన్నారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించాను.

News July 2, 2024

కావలి ప్రమాదం నన్ను ఆందోళనకు గురి చేసింది: లోకేశ్

image

కావలి సమీపంలో పాఠశాల బస్సును లారీ ఢీకొనడంతో ఒకరు <<13549405>>చనిపోయిన<<>> విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. క్లీనర్ చనిపోవడం బాధాకరం. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించా. స్కూలు యాజమాన్యాలు బస్సులను కండీషన్‌లో ఉంచుకోవాలి. బస్సుల ఫిట్ నెస్ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

News July 2, 2024

NLR: కాల్ మాట్లాడిన తర్వాతే డాక్టర్ సూసైడ్

image

నెల్లూరు మెడికల్ కాలేజీ భవనంపై నుంచి దూకి డాక్టర్ జ్యోతి(38) నిన్న <<13545642>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. నల్గొండకు చెందిన ఆమెకు నెల్లూరుకు చెందిన రవితో 2014లో వివాహమైంది. వీరికి మూడేళ్ల పాప ఉంది. రవి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్‌. చేజర్ల మండలంలో పని చేసే జ్యోతి శిక్షణ కోసం నెల్లూరుకు వచ్చారు. మధ్యాహ్నం వరకు బాగానే ఉన్న ఆమె.. భోజనం తర్వాత వచ్చిన కాల్ మాట్లాడి సూసైడ్ చేసుకున్నారు.

News July 2, 2024

జైలులో పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రులు

image

నెల్లూరు సెంట్రల్ జైలులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. కేసు వివరాలను తెలుసుకున్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.