India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా వ్యాప్తంగా 95 శాతం వరకు పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో శనివారం రోజునే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు చెప్పారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి జిల్లావ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ మొదలు కాగా, రాత్రి 7 గంటల సమయానికి 95 శాతం వరకు పింఛన్లను ప్రభుత్వ అధికారులు పంపిణి చేశారు.
రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రూట్ మార్చినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. వాటి వివరాల కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని హెల్ప్ లైన్ నెంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది. నెల్లూరు- 7815909469, గూడూరు-08624-250795 నంబర్లకు సంప్రదించాలని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. వర్షాల దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏదైనా ఇబ్బంది ఉంటే క్రింద తెలిపిన నంబర్లకు కాల్ చేయాలని ఆయన కోరారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్.0861-2331261
టోల్ ఫ్రీ No.1077
అనంతసాగరం వద్ద కండక్టర్ చేసిన నిర్వాకం స్థానికులు విస్తు పోయారు. సరస్వతమ్మ(60), రామచంద్రరెడ్డి(75) అనే వృద్ధ దంపతులు అనంతసాగరం నుంచి తమ గ్రామం కంభంపాడు వెళ్లేందుకు బస్టాండ్‌లో వేచి ఉన్నారు. బస్సు రాగానే భార్యను రామచంద్రరెడ్డి బస్సు ఎక్కించి కింద ఉండే సంచులు తీసుకుని వచ్చేలోపే బస్సు బయలు దేరి వెళ్లిపోయింది. భర్త వస్తున్నాడు అన్న వినకుండా వెనక బండ్లో రండి అని ఆమెను కూడా కండక్టర్ మధ్యలో దించేశాడు
దగదర్తికి చెందిన యువకుడు కావలికి చెందిన యువతిని 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వారి మధ్య గొడవలు జరిగగా..పెద్దలు రాజీ చేశారు. ఇటీవల భర్త HYDలో ఉద్యోగం వచ్చిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ క్రమంలో భార్యకు తెలియకుండా కందుకూరుకు చెందిన యువతిని అదే పట్టణంలో వివాహం చేసుకునేందుకు సిద్దమమయ్యాడు. విషయం తెలుసుకున్న భార్య మండపానికి వచ్చే లోపు వివాహమైంది. రచ్చ పోలీస్ స్టేషన్‌కు చేరింది.
జిల్లాలో నిమ్మ ధరలు పెరిగాయి. పొదలకూరు మార్కెట్లో శుక్రవారం కిలో రూ.110 నుంచి రూ.120వరకు ధర పలికింది. ఈ మార్కెట్‌కు కలువాయి, చేజర్ల, రాపూరు, మనుబోలు, సైదాపురం మండలాల నుంచి కాయలు వస్తుంటాయి. ఏప్రిల్‌లో కురిసిన వర్షాలకు పూత, పిందె రాలిపోవడంతో వచ్చిన తక్కువ దిగుబడికి శ్రావణమాసం, వినాయకచవితి పండగల నేపథ్యంలో గిరాకీ పెరిగింది. మరో 3నెలలు నిమ్మ ధరలు ఇలాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
రాపూర్ మండలంలోని పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం నాలుగోవ శుక్రవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం రాత్రి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లుగా IASలను నియమించింది. నెల్లూరు జిల్లాకు ప్రజా వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ చేవూరి హరికిరణ్ IAS(2009)ను కేటాయించింది. మరోవైపు తిరుపతి జిల్లా(సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి)కు ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ IAS(2006) స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు..
తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు భారీగా పోటెత్తారు. కంపార్టుమెంట్లు అన్నీ నిండి… క్యూ లైన్ టీబీసీ వరకు వెళ్లింది. సర్వదర్శనం కోసం సుమారు 18గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక నిన్న స్వామివారిని 62, 569 మంది దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
మండల కేంద్రమైన మనుబోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న బోటనీ అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ తెలిపారు. MSC బోటనీలో 50% మార్కులు పొందిన వారు, సెప్టెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను కళాశాలలో అందించాలన్నారు.
Sorry, no posts matched your criteria.