Nellore

News June 28, 2024

పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రి కాకాణి

image

మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కలిశారు. పిన్నెల్లిపై అనేక కేసులు బనాయించి జైలులో పెట్టడం హేయమైన చర్యని కాకాణి అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, అండగా నిలిచి సంఘటితంగా పోరాడుతామని ఆయన చెప్పారు.

News June 28, 2024

నెల్లూరులో కల్కి కలెక్షన్స్ ఎంతో తెలుసా?

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కల్కి థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. విజువలైజేషన్ అద్భుతంగా ఉండటంతో సినిమా చూడటానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో తొలిరోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే దాదాపు 1.7 కోట్లు రాబట్టిందని సమాచారం. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News June 28, 2024

నెల్లూరు జిల్లాకు రూ.219 కోట్లు అవసరం..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3.19 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. గత నెలలో రూ.96 కోట్లు మంజూరయ్యాయి. పింఛన్ రూ.4 వేలకు పెంచడంతో మరో రూ.30 కోట్లు అదనంగా పంచాలి. అలాగే ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించి పెరిగిన రూ.3 వేలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన జులై ఒకటో తేదీన జిల్లాలో ఒక్కొక్కరికీ రూ.7 వేలు చొప్పున డబ్బులు పంచడానికి రూ.219 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు.

News June 28, 2024

నెల్లూరు: మీ కొత్త MLA నుంచి ఏం ఆశిస్తున్నారు?

image

నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఫోకస్​పెట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. మరి మీ MLA నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ నియోజకవర్గంలో సమస్యలేంటి? కామెంట్ చేయండి.

News June 28, 2024

నెల్లూరు: ఐటీడీఏ పీఓ మందా రాణి బదిలీ

image

నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న మందా రాణిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జడ్పీ సీఈవో కన్నమనాయుడును విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దీంతో ఆమెను మాతృ శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌గా విశాఖపట్నానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News June 28, 2024

నెల్లూరు జిల్లాలో 883 ప్రమాదాలు..408 మంది మృతి

image

నెల్లూరు జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నెల్లూరు నగర ట్రాఫిక్ డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు గత ఏడాది మొత్తం 883 ప్రమాదాలు జరగగా ..998మంది క్షతగాత్రులయ్యారు, 408మంది మృతి చెందారు. వీటిలో ఎక్కువగా తలకు బలమైన గాయాలు కావడం వల్లే మృతి చెందినట్లు నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులు పూర్తి స్థాయిలో హెల్మెట్ ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News June 28, 2024

నెల్లూరు : జులై 3 వరకు రైల్వేగేటు క్లోజ్

image

మరమ్మతుల నిర్వహణ కోసం కొండాయపాళెం రైల్వేగేటును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జులై 3వ తేదీ వరకు ఆ మార్గంలో రాకపోకలు జరగవని సూచించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొని ..అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News June 28, 2024

మిస్సింగ్ కేసుల కోసం ప్రత్యేక బృందాలు

image

నెల్లూరు జిల్లాలో మిస్సింగ్ కేసులపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆరీఫ్ హఫిజ్ సూచించారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత కేసుల గురించి తెలుసుకున్నారు. సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. ప్రత్యేక బృందాలతో మిస్సింగ్ కేసులను చేధించాలని ఆదేశాలు జారీ చేశారు.

News June 28, 2024

ఆస్ట్రేలియా హైకమిషనర్‌ను కలిసిన వేమిరెడ్డి

image

ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్‌ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో లోక్‌సభ ఎంపీలతో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్‌కు వేమిరెడ్డి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. పలు అంశాలపై చర్చించారు.

News June 27, 2024

ఎస్జీటీ పోస్టులు పెంచాలని మంత్రికి వినతి

image

నెల్లూరు జిల్లాలో ఎస్జీటీ పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలువురు  దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరులోని ఆయన కార్యాలయంలో కలిశారు. జిల్లాలో టీటీసీ చేసిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారని చెప్పారు. రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య పెరిగేలా చూడాలని కోరారు.