India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెళ్లకూరు మండలం కానూరు రాజుపాలెం అడవుల్లో కోడి పందేల శిబిరంపై ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం దాడి చేశారు. 10 బైక్‌లు, 17 ఫోన్స్, 2 కోడి పుంజులతో పాటు రూ.3,820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మొత్తం 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కోడి పందేలు, పేకాట ఆడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
నెల్లూరు నేతకు మాజీ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. గతంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలను చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు. తాజాగా వైసీపీ టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకే జగన్ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు టీచర్లు, వైసీపీ నేతలు చంద్రశేఖర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
నెల్లూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ప్రభుత్వ పాఠశాలల HMలు, టీచర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో పీవీజే రామారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీ సాయంత్రంలోగా ఉప, మండల విద్యా శాఖాధికారుల ద్వారా డీఈవో ఆఫీసుకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాలకు జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలని వివరించారు.
కావలిలో పట్టణానికి చెందిన బాలిక(14) దర్శి(M) రాజంపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు వరుణ్ సాయితో పరిచయమైంది. ఇది ప్రేమగా మారి దగ్గరయ్యారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రలు నెల్లూరులో పరీక్షలు చేయగా ఆమె 7 నెలల గర్భిణీ అని తేలింది. ఈనెల 18న కావలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుణ్‌పై పోక్సో కేసు నమోదైంది. కేసు వెనక్కి తీసుకోకపోతే యాసిడ్ పోసి తగలబెడగానని బాధితులను వరుణ్ భయపెడుతున్నాడు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ డాక్టర్ అమెరికాలో చనిపోయారు. నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన పేరంశెట్టి డాక్టర్ రమేశ్ బాబు(64) అమెరికాలో ఎన్నో ఆసుపత్రులు నిర్మించి సేవలు అందించారు. టస్కలూసా ప్రాంతంలో మంచి డాక్టర్‌గా పేరుపొందారు. శుక్రవారం సాయంత్రం తుపాకీ కాల్పుల్లో చనిపోయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నా.. ఘటన ఎలా జరిగిందో తెలియరావడంలేదు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఆయన చదివారు.
వెంకటాచలం సమీపంలోని జాతీయ రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న నగరవనాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నగరవనాన్ని దేశంలోనే నెంబర్ 1 నగరవనంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. నెల్లూరు ప్రజలు కుటుంబాలతో కలిసి ఆహ్లాదకరంగా గడిపే విధంగా ఈ నగరవనాన్ని రూపుదిద్దుతామని ఆయన తెలిపారు.
నెల్లూరు జీజీహెచ్ ఆవరణలోని శనివారం గుర్తు తెలియన మృతదేహం కలకలం రేపింది. ఆసుపత్రి వెనుక వైపు కుళ్లిన శవం ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా.. కుళ్లినస్థితిలో ఉన్న మృతదేహాన్ని పేషెంట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఓజిలి మండలం 16వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. మండల కేంద్రమైన ఓజిలి బీసీ కాలనీకి చెందిన గోనుపల్లి రవి (35) అనే వ్యక్తి రాజుపాలెం పెట్రోల్ బంకు వైపు వెళుతుండగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి మృతితో బీసీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద నెల్లూరు రూరల్ DSP <<13930649>>వాహనాన్ని ఢీకొట్టి<<>> వెళ్లిపోయిన నిందితుడు డీసీపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఆత్మకూరు CIకి పట్టుబడిన సంగతి తెలిసిందే. గంజాయి స్మగ్లర్‌గా అనుమానిస్తున్న అతనిని పోలీసులు విచారించగా..రాజమండ్రి సమీపంలోని రాజానగరానికి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు. పట్టుబడిన బొలెరోలో ఎలాంటి గంజాయి లభించకపోవడంతో మార్గమధ్యంలో గంజాయిని దించేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అర్ధరాత్రి వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద నెల్లూరు రూరల్ డీఎస్పీని ఢీకొట్టి ఓ వాహనం పరారైన విషయం తెలిసిందే. నిందితుడిని ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్రిపాడు మండలం డీసీ ప్లాజా దగ్గరలోని కోనసముద్రం వద్ద ఆత్మకూరు సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో వాహనాన్ని ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో సీఐ వాహనం పొలాల్లోకి దూసుకెళ్లగా.. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడు గంజాయి స్మగ్లర్ అని తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.