Nellore

News June 20, 2024

మైపాడు బీచ్‌లో ఆదిశంకర కాలేజ్ విద్యార్థి మృతి

image

మైపాడు బీచ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గూడూరు ఆదిశంకర కాలేజ్‌కి చెందిన కొందరు విద్యార్థులు మైపాడు బీచ్‌కు వెళ్లి సముద్రంలో ఈత కొడుతుండగా వారిలో ఒక విద్యార్థి సముద్రంలో మునిగిపోయాడు. తోటి విద్యార్థులు గమనించి అతనిని ఒడ్డుకు చేర్చారు. కొన ఊపిరితో ఉన్న అతనిని వెంటనే మైపాడులోని ప్రజా వైద్యశాలకు తరలించి అత్యవసర వైద్యం అందించినా అతను మరణించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 20, 2024

NLR: ఇన్సూరెన్స్ కోసం అలా చేశారా..?

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో కారుపై పెద్దపులి దాడి చేసినట్లు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కారును పరిశీలించిన అధికారులు.. దానిపై ఎలాంటి జంతువు దాడి చేయలేదని తేల్చారు. ఎక్కడో ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్, లేదా ఇతర ప్రయోజనాల కోసం యజమాని ఇలా చేశారని తెలుస్తోంది. పెద్దపులి దాడి అంటూ అధికారులు, మీడియాను తప్పుదోవ పట్టించిన యజమానిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

News June 20, 2024

బీద రవిచంద్రకు MLC..?

image

కావలికి చెందిన బీద రవిచంద్ర టీడీపీ కీలక నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. తాజాగా రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఈక్రమంలో మరోసారి రవిచంద్రకు చంద్రబాబు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు ఉంటున్నారు.

News June 20, 2024

నెల్లూరులో వైసీపీ నాయకులపై పోలీసు కేసు

image

YCP నేతలపై నెల్లూరు నగరంలోని మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ కోవాకొల్లు విజయలక్ష్మితో పాటు పలువురు నేతలపై కేసు నమోదైంది. మరోవైపు వైసీపీ క్లస్టర్ ఇంచార్జ్ ముడియాల రామిరెడ్డి, 19వ డివిజన్ నేతలు లక్ష్మీనారాయణ, పచ్చా రవి, జల్లి కుమార్‌పై బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 35వ డివిజన్ కార్పొరేటర్ శరత్ చంద్రపై చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు కోరారు.

News June 20, 2024

జిల్లాలో అల్లరిమూకలు ఆట కట్టించాలి : ఎస్పీ

image

నెల్లూరు జిల్లా SP ఆరిఫ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల ప్రారంభం, ముగింపు సమయాలలో విద్యార్థినులకు భరోసా కల్పిస్తూ విజబుల్ పోలీసింగ్ ను నెల్లూరు పోలీసులు నిర్వహిస్తున్నారు. భావితరాల భవిష్యత్‌కు పునాది అయిన బాలికలకు రక్షణ, భద్రత కల్పించాలని ఆదేశించారు. ఈవ్ టీజింగ్, ఇతర నేరాలు అరికట్టాలని, అల్లరిమూకల ఆటకట్టించాలన్నారు. స్కూల్స్, కళాశాలల వద్ద గస్తీ నిర్వహించాలన్నారు.

News June 19, 2024

జిల్లాలో అల్లరిమూకలు ఆట కట్టించాలి : ఎస్పీ

image

నెల్లూరు జిల్లా SP ఆరిఫ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల ప్రారంభం, ముగింపు సమయాలలో విద్యార్థినులకు భరోసా కల్పిస్తూ విజబుల్ పోలీసింగ్ ను నెల్లూరు పోలీసులు నిర్వహిస్తున్నారు. భావితరాల భవిష్యత్‌కు పునాది అయిన బాలికలకు రక్షణ, భద్రత కల్పించాలని ఆదేశించారు. ఈవ్ టీజింగ్, ఇతర నేరాలు అరికట్టాలని, అల్లరిమూకల ఆటకట్టించాలన్నారు. స్కూల్స్, కళాశాలల వద్ద గస్తీ నిర్వహించాలన్నారు.

News June 19, 2024

ఆదాల నయవంచకుడు: వైవీ

image

నెల్లూరుకు చెందిన వైసీపీ నేత వైవీ రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ద మనిషి అనే ముసుగు వేసుకున్న నయవంచకుడు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. రూ.2 కోట్ల ఖర్చు పెట్టి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయించాడు. కోటంరెడ్డి మంచి నాయకుడు. నాకు 40 ఏళ్లుగా స్నేహితుడు. ప్రజల సమస్యలు తీర్చే అసలైన నాయకుడు ఆయనే’ అని వైవీ రామిరెడ్డి అన్నారు.

News June 19, 2024

నెల్లూరు జిల్లాకు రూ.33.19 కోట్ల కేటాయింపు

image

నెల్లూరు జిల్లాకు పీఎం కిసాన్ కింద రూ.33.19 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ప్రధానమంత్రి మోదీ వారణాసి నుంచి మంగళవారం ఆన్‌లైన్ విధానంలో నిధులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తోంది. జిల్లాలో అర్హత కలిగిన 1,65,978 మంది రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి తెలిపారు.

News June 19, 2024

మలేరియాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం: కలెక్టర్

image

2027 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

News June 18, 2024

దగదర్తి: నిలకడగా మాలేపాటి ఆరోగ్యం

image

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కావలి నియోజకవర్గం నేత మాలేపాటి సుబ్బానాయుడు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. మాలేపాటి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం వైద్య పరీక్షల అనంతరం ఐసీయూ నుంచి వార్డుకు మార్చే అవకాశం ఉందని తెలిపారు.