India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ పై రాజానగరం పోలీసులు శనివారం మరో కేసు నమోదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటన ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు ఇవ్వడంపై అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ఘటన స్థలం వద్ద కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించడంపై కేసు నమోదు పోలీసులు చేశారు. ఇది పాస్టర్ ప్రవీణ్ ఘటనకు సంబంధించి హర్ష కుమార్ పై నమోదైన మూడో కేసుగా పోలీసులు తెలిపారు.
అనంతపురం జిల్లా రూరల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలో ఈ-వేస్ట్ కలెక్షన్ కౌంటర్, చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ-వేస్ట్ ప్రత్యేక నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నేడు(ఆదివారం) కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. సోంపేట మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించనన్నారు. కంచిలి మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఇచ్ఛాపురం మండలంలో బెల్లుపడలో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొని, అనంతరం ప్రజలు నుండి వినతులు స్వీకరిస్తారు.
నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్‌ను అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలో 48వ డివిజన్‌లో సురక్షిత తాగునీటి పథకంలో భాగంగా డిస్పెన్సింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. పేద ప్రజల కోసం 2018లోని ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామన్నారు.
డ్రోన్ కొనుగోలుకు రైతు గ్రూపులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, డ్రోన్ గ్రూపు సభ్యులు కన్వీనర్, కో కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రోన్ కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రూ.10 లక్షల రుణం అందిస్తామన్నారు.
జిల్లాలో మామిడి పండించే రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని, వారు ఎదగడానికి ఏ రకమైన సహకారం కావాలో తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం విజయనగరంలోని ఓ హోటల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులు పంటను పరిరక్షించుకోడానికి కావలసిన సాంకేతికతను కూడా తెలుసుకోవాలని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను కూడా తెలుసుకోవాలని తెలిపారు.
వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లా అన్ని విధాలా అభివృద్ది చెందేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జిల్లాకు తనను ప్రత్యేక అధికారిగా నియమించిందని తెలిపారు.
భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్‌ను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరి శ్రీనివాసపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా సంఘం అధ్యక్షుడు దోవా గోవర్ధన్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వివి నాయుడుకు ఫిర్యాదు చేశారు.
ఐఐటీ-జేఈఈ మెయిన్ ఫలితాల్లో విజ్ఞాన్ విద్యార్థులు ప్రతిభ చాటారని విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల కూర్మనాథ్ తెలిపారు. కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 50% మంది 90 పర్సంటైల్ సాధించారన్నారు. విష్ణు కార్తీక్(99.45), శ్రీకాంత్(98.38), విష్ణువర్ధన్(98.05), ఉమేశ్(97.01), ప్రేమ్ సాగర్(96.33) తదితరులు రాణించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు.
పోర్టు పరిసర ప్రాంతాల యువతకు ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రీషియన్, C.N.C. ఆపరేటర్, C.N.C. ప్రోగ్రామర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు C.E.M.S. ప్రోగ్రాం మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ హెడ్ ప్రజిత్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం పోర్టు, C.E.M.S. సంయుక్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఈ శిక్షణ ఏర్పాటు చేశారన్నారు. అనంతరం వారికి ఉపాధి కల్పిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.