Andhra Pradesh

News June 28, 2024

ప్రకాశం జిల్లాకు పొంచి ఉన్న తుఫాను ముప్పు

image

జిల్లాకు తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.

News June 28, 2024

ప.గో: విషాదం.. పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు

image

ప.గో జిల్లా పెనుగొండ మండలం వదలిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. టి.గంగయ్య(50) అనే రైతు ఉదయం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. కరెంట్ స్తంభం నుంచి తెగిపోయి నీటిలో పడి ఉన్న తీగను గమనించకుండా పొలంలో దిగాడు. షాక్ కొట్టడంతో పొలంలోనే గంగయ్య ప్రాణాలు వదిలాడు. గంగయ్య భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని స్థానికులు తెలిపారు.

News June 28, 2024

శ్రీకాకుళం: MA రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఫిబ్రవరి-2024లో నిర్వహించిన MA ఇంగ్లిష్ మొదటి సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ లో చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 28, 2024

వైసీపీకి డాక్టర్ టీవీ రావు రాజీనామా

image

వ్యాపారవేత్త, దాక్షిణ్య సంస్థ వ్యవస్థాపకుడు, వైసీపీ నేత డాక్టర్ టీవీ రావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఏపీ స్టేట్ గ్రూప్ వన్ అధికారిగా పని చేసిన ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున 2004 గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆపై వైసీపీలో చేరి, తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.

News June 28, 2024

నెల్లూరు: మీ కొత్త MLA నుంచి ఏం ఆశిస్తున్నారు?

image

నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఫోకస్​పెట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. మరి మీ MLA నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ నియోజకవర్గంలో సమస్యలేంటి? కామెంట్ చేయండి.

News June 28, 2024

చిత్తూరు: మీ కొత్త MLA నుంచి ఏం ఆశిస్తున్నారు?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఫోకస్​పెట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. మరి మీ MLA నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ నియోజకవర్గంలో సమస్యలేంటి? కామెంట్ చేయండి.

News June 28, 2024

శ్రీకాకుళం: ప్రియుడు మోసం.. బాలిక ఆత్మహత్యాయత్నం

image

ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి అదే గ్రామానికి చెందిన జగదీశ్ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. శారీరకంగా దగ్గరవడంతో విద్యార్థిని గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని కోరగా జగదీశ్ ముఖం చాటేయడంతో బాలిక యాసిడ్ తాగింది. బాలిక పరిస్థితి విషమం ఉందని పోలీసులు తెలిపారు.

News June 28, 2024

మీ కొత్త MLA నుంచి ఏం ఆశిస్తున్నారు?

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఫోకస్​పెట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. మరి మీ MLA నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలేంటి? కామెంట్ చేయండి..

News June 28, 2024

ప.గో: కాటేస్తోన్న ‘కరెంట్’.. ఇప్పటికే 25 మంది మృతి

image

ప్రజల అజాగ్రత్త.. అధికారుల నిర్లక్ష్యం.. కారణాలేవైనా ఉమ్మడి ప.గో.లో విద్యుత్ ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే ఆగిరిపల్లిలో <<13521060>>తల్లీకొడుకు<<>>, తాడేపల్లిగూడెంలో <<13520724>>దంపతులు<<>> మరణించారు. 2022 APR 1 నుంచి దాదాపు 119మంది మృతిచెందారు. 2022-23లో 60 ప్రమాదాలు జరగ్గా 45మంది, 202324లో 58 ఘటనల్లో 49మంది చనిపోయారు. 2024-25లో ఇప్పటికే 49 విద్యుత్ ప్రమాదాలు జరగ్గా.. 25మంది ప్రాణాలొదిలారు.

News June 28, 2024

ప్రకాశం జిల్లాలో 2,91,524 మందికి ఎన్టీఆర్ భరోసా

image

ఎన్టీఆర్ భరోసా కింద ప్రకాశం జిల్లాలో అన్ని విభాగాలకు సంబంధించిన 2,91,524 మందికి పింఛన్ నగదు అందనుంది. కొత్తగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెంచిన మొత్తం నగదు అందించేందుకు గాను 199.07 కోట్ల రూపాయల నగదు మంజూరైంది. ఈ నగదును బ్యాంకుల నుంచి ఈ నెల 29వ తేదీన డ్రా చేసుకుని ఇంటింటికీ సచివాలయ ఉద్యోగుల ద్వారా 1వ తేదీన పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.