Andhra Pradesh

News June 28, 2024

విజయనగరం జిల్లా తైక్వాండో జట్టు ఎంపిక

image

ఈ నెల 30 నుంచి విశాఖపట్నంలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి క్వాడిట్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే విజయనగరం జిల్లా జట్టు ఎంపిక నిర్వహించారు. గురువారం విజ్జీ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో అండర్- 12, అండర్- 13, అండర్- 14 విభాగాల్లో బాల బాలికలను ఎంపిక చేశారు. జిల్లాలోని 8 మండలాల నుంచి 50 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

News June 28, 2024

విశాఖ: రేపు జాతీయ లోక్ అదాలత్.. జిల్లా న్యాయమూర్తి

image

విశాఖ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 29వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా న్యాయమూర్తి ఎ.గిరిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు, సివిల్, బౌన్స్, బ్యాంకింగ్, మోటర్ ప్రమాదాల నష్టపరిహారం కేసులు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News June 28, 2024

తిరుపతి: JRFకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో డెవలప్మెంట్ ఆఫ్ నానో ఎన్క్యాప్సిలేషన్ నాచురల్ ఆంటీ మైక్రో బయాల్స్ ఫర్ ఫుడ్ ప్రిజర్వేషన్ నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొఫెసర్ ఉమామహేశ్వరి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ ‌సైట్‌ను చూడాలని సూచించారు.

News June 28, 2024

నెల్లూరు : జులై 3 వరకు రైల్వేగేటు క్లోజ్

image

మరమ్మతుల నిర్వహణ కోసం కొండాయపాళెం రైల్వేగేటును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జులై 3వ తేదీ వరకు ఆ మార్గంలో రాకపోకలు జరగవని సూచించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొని ..అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News June 28, 2024

ప.గో జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు ఇలా

image

ప.గో జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. నరసాపురంలో అత్యధికంగా 87.0, పాలకొల్లు 72.4, భీమవరం 79.4, ఉండి 68.8 , వీరవాసరం 59.2, పాలకోడేరు 52.2, గణపవరం 46.4, ఆకివీడు 47.4, యలమంచిలి 40.2, కాళ్ల 40.2, పెనుగొండ 38.2, ఆచంట 38.0, పెనుమంట్ర 37.8, పోడూరు 30.4, అత్తిలి 25.2, మొగల్తూరు 24.6, తాడేపల్లిగూడెం 19.4, పెంటపాడు 17.2, ఇరగవరం 16.2, తణుకు 9.4 మిమీ చొప్పున నమోదైంది.

News June 28, 2024

అనంతపురం JNTU వీసీ రాజీనామా

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ జీ.వీ.ఆర్ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వీసీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డిప్యూటేషన్‌పై అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్స్‌లర్‌గా వచ్చిన విషయం తెలిసిందే.

News June 28, 2024

కేరళలో కవిటి మండల వాసి మృతి

image

ప్రమాదవశాత్తు కవిటి మండల యువకుడు కేరళలో మృతి చెందిన ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. జి.కరాపాడ గ్రామానికి చెందిన సురేశ్ అలియాస్ కాళీ ఉదయం తాను పని చేస్తున్న ప్రదేశం నుంచి జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సురేశ్‌కు ఇటీవల పెళ్లి నిశ్చయమైనట్లు కుటుంబీకులు తెలిపారు.

News June 28, 2024

కర్నూల్: పింఛన్ పండుగకు వేళాయె

image

కర్నూల్ జిల్లాలో పింఛన్ పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 2,45,229 మందికి జులై 1న పింఛన్ అందజేయనున్నారు. పెంచిన ప్రకారం జులై నెలకు రూ.167.34 కోట్లు పంపిణీ చేయనున్నారు. సచివాలయం సిబ్బందితో జులై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీని ప్రారంభిస్తారు. మొత్తం నాలుగు రకాల కేటగిరీ పింఛనుదారుల్లో 11 సబ్ కేటగిరీలకు చెందిన వారికి మొత్తం రూ.7 వేలు అందజేయనున్నారు.

News June 28, 2024

కడప: ప్రేమ వివాహం.. ఏడాదికే సూసైడ్

image

కడప నబీకోటలో ఈనెల 23న వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నబీకోటలో ఉండే మాధవ్ (35)ని 14 ఏళ్ల బాలిక ప్రేమించింది. ఇంట్లో వద్దని చెప్పినా వినకుండా గతేడాది ప్రేమ వివాహం చేసుకోగా, వీరికి ఏడాది బాలుడు ఉన్నాడు. భర్త మాధవ్, అత్త వెంకటసుబ్బమ్మతో పాటు మరో ఇద్దరు కలిసి ఆమెను వేధించారు. వేధింపులు తాళలేక ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.

News June 28, 2024

రేపు ఉమ్మడి ప.గో వ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని అన్ని కోర్టులో ఈనెల 29న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తమకుమార్‌ తెలిపారు. ఈ లోక్‌ అదాలత్‌లో ప్రామిసరీ నోటు దావాలు, ఆస్తి దావాలు, తనఖా, మోటారు వాహన ప్రమాద కేసులు, కార్మిక వివాదాలు, చిట్‌ఫండ్‌ సంబంధిత, ఆర్బిటేషన్‌ కింద రికవరీ కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.