Andhra Pradesh

News June 28, 2024

VZM: పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు

image

పెన్షన్ దారులు ఇంటివద్దనే రూ.7వేలు నగదు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సచివాలయాల సిబ్బంది పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 974 సచివాలయాలు ఉండగా.. వాటిలో 8,766 మంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 4,27,286 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందుబాటులో లేనివారికి బ్యాంక్ ఖాతాలలో జమచేయనున్నారు. దివ్యాంగులు రూ.15వేలు అందుకోనున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

News June 28, 2024

ప్రకాశం: లైంగిక వేధింపులు.. అధికారి సస్పెండ్

image

మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తోటి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ మహిళతో ‘నాకు సహకరించకుంటే నీ డిప్యూటేషన్ రద్దు చేస్తానని’ బెదిరించాడు. గత కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులతో విచరణకు ఆదేశించారు. దీంతో నాగేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.

News June 28, 2024

శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త

image

జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది జిల్లాలోని మొత్తం 93 ఇంటర్ కళాశాలలోని మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 8,420 మంది ఉండగా, మొదటి ఏడాదిలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. జులై 15 నాటికి పుస్తకాలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

News June 28, 2024

చిత్తూరు: రేపు జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. లోక్ అదాలత్ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 32 బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News June 28, 2024

తూ.గో: లస్కర్ల నియామకానికి ప్రతిపాదనలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో జల వనరుల శాఖకు సంబంధించి వివిధ డివిజన్లకు 681 మంది ఔట్ సోర్సింగ్ లస్కర్ల నియామకానికి గురువారం ప్రతిపాదనలు పంపించారు. తూర్పు డెల్టా (రామచంద్రపురం)లో 92, మధ్య డెల్టా (అమలాపురం) 125, డ్రైనేజీ డివిజన్ (కాకినాడ) 37, వైఐ డివిజన్ (పెద్దాపురం) 60, హెడ్ వర్క్స్ డివిజన్ (ధవళేశ్వరం) 139, పశ్చిమ డెల్టా (నిడదవోలు) 208, డ్రైనేజీ డివిజన్ (భీమవరం) 20 మంది నియామకానికి ప్రతిపాదన పంపించారు.

News June 28, 2024

VZM: జగన్ అక్కా చెల్లెమ్మలను మోసం చేశారు.. సీఐటీయూ

image

అక్క చెల్లెమ్మలను ఆదుకుంటామని మాజీ సీఎం జగన్ చేయూత లబ్ధి దారులను మోసం చేశారని ఆందోళన చేపట్టారు. విజయనగరం డీఆర్డీఏ కార్యాలయం వద్ద చేయూత లబ్ధిదారులు ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కార్యదర్శి వి. లక్ష్మి, సీఐటీయూ నగర అధ్యక్షుడు జగన్మోహన్ మాట్లాడారు. చేయూత 4వ విడతకి ఒక్కొక్కరికి రూ.18,750 ఇవ్వాలని బటన్ నిక్కిన జమకాలేదని ఆందోళన చేపట్టామన్నారు.

News June 28, 2024

SVU ఉపకులపతి రాజీనామా

image

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి పదవికి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతులను కూడా ఉన్నతాధికారులు రాజీనామాలు సమర్పించాలని కోరినట్లు సమాచారం‌.

News June 28, 2024

ఆ ఘటనలపై నివేదిక ఇవ్వండి: మంత్రి పయ్యావుల

image

గుత్తి మండలంలోని రజాపురం గ్రామంలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ నివేదిక కోరారు. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత తాగునీరు, కల్తీ ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అలాగే ఉరవకొండ మండలం చిన్న ముస్టూరులో నాగేంద్ర అనే వృద్ధుడు వాంతులు, విరేచనాలతో మృతి చెందిన ఘటనపై కూడా నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను మంత్రి కోరారు.

News June 28, 2024

విశాఖ: వివాహిత మృతి కేసులో ముగ్గురు అరెస్టు

image

వరకట్న వేధింపులతో వివాహిత మృతికి కారకులైన ముగ్గురిని గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లికి చెందిన ఎం. పద్మిని (32) కి గాజువాకకు చెందిన సోమేశ్‌తో వివాహం అయ్యింది. అదనపు కట్నం కోసం భర్త సోమేశ్, అత్త అప్పలనర్స, మరిది శివ కలిసి తమ కుమార్తెను వేధించి పురుగుమందు తాగించి చంపేశారని పద్మిని తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

News June 28, 2024

భీమవరం: RTC బస్సు ఢీకొని బీటెక్ స్టూడెంట్‌ మృతి

image

భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన కోయ రాజేంద్రరామ్(20) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రామ్ భీమవరం నుంచి తుందుర్రు వెళ్తుండగా.. తాడేరు వద్ద ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడి తమ్ముడికి తీవ్ర గాయాలు కావడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై భీమరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.