Andhra Pradesh

News June 28, 2024

కర్నూలు జిల్లాలోని అటవీ భూములపై డిప్యూటీ సీఎం ఆరా

image

కర్నూలు జిల్లాలోని అటవీ భూములపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కర్నూలు డి.ఎఫ్.ఓ. శ్యామల, నంద్యాల డి.ఎఫ్.ఓ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి సుబ్బరాయుడు ఇందుకు వివరాలను డిప్యూటీ సీఎంకు తెలియజేశారు.

News June 28, 2024

నేడు తోటపల్లి ప్రాజెక్టు నీరు విడుదల

image

గరుగుబిల్లి మండలంలో ఉన్న తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి సాగునీటిని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేడు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మంత్రి సంధ్యారాణి సాగునీటిని విడుదల చేయనున్నారు. సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర అధికారులు పాల్గొనున్నారు.

News June 28, 2024

ప్రకాశం: నూతన చట్టాలపై అవగాహన అవసరం: ఎస్పీ

image

జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నూతన చట్టాల పట్ల పోలీసులందరికీ అవగాహన ఉండాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు.

News June 28, 2024

కృష్ణా: LL.B కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన నాలుగవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 24, 26, 29, 31, ఆగస్టు 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News June 28, 2024

నిడదవోలు: సమన్వయంతో పనిచేయాలి: మంత్రి దుర్గేష్

image

ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులైన పేదలకు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల స్థాయి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

News June 28, 2024

మిస్సింగ్ కేసుల కోసం ప్రత్యేక బృందాలు

image

నెల్లూరు జిల్లాలో మిస్సింగ్ కేసులపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆరీఫ్ హఫిజ్ సూచించారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత కేసుల గురించి తెలుసుకున్నారు. సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. ప్రత్యేక బృందాలతో మిస్సింగ్ కేసులను చేధించాలని ఆదేశాలు జారీ చేశారు.

News June 28, 2024

వసతులపై నివేదిక ఇవ్వండి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై జులై 7వ తేదీ లోపు నివేదిక అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కుప్పంలోని R&B గెస్ట్‌హౌస్‌లో సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో నివేదిక తయారు చేయాలన్నారు. ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని ఆదేశించారు.

News June 28, 2024

ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష

image

మహిళ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అప్పు విషయంలో మహిళతో దుర్భాషలాడి ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన శివ నాగమణి, శ్రీనివాసరెడ్డిలకు కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.8వేల జరిమానా విధించిందని తెలిపారు. 

News June 28, 2024

పింఛన్ దారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండండి: కీర్తి చేకూరి

image

జులై 1వ తేదీన నగరంలో ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించనున్నట్లు జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. జులై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి వార్డు సచివాలయాల వారిగా పింఛన్లు పంపిణీ జరుగుతుందన్నారు. పింఛనుదారులు తమ ఇంటి వద్దకు పింఛను అందించడానికి వచ్చే సచివాలయ కార్యదర్శులకు అందుబాటులో ఉండి సహకరించాలని కమిషనర్ కోరారు.

News June 28, 2024

సత్యసాయి: ఇంటి వద్దకే పింఛన్లు

image

జూలై 1న ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. శనివారం బ్యాంకుల ద్వారా అధికారులు నగదు విత్ డ్రా చేసుకోవాలని సూచించారు.