Andhra Pradesh

News June 27, 2024

కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన రైల్వే అధికారులు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జూలై 4 నుంచి అక్టోబర్ 10వరకు ప్రతి మంగళవారం, నం.05951 SMVB- NTSK రైలును జూలై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News June 27, 2024

హోం మంత్రి అనిత ఫొటో ఉన్న ఫ్లెక్సీ చించివేత

image

ఎస్.రాయవరం మండలం పెద్ద ఉప్పలం గ్రామంలో హోం మంత్రి అనిత ఫొటో ఉన్న ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. విత్తనాల పంపిణీ కార్యక్రమానికి హోంమంత్రి అనిత హాజరవ్వగా టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాతబ్బాయి గ్రామ సచివాలయం వద్ద ఫ్లె‌క్సీ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫొటోను చించేయడంతో తాతబ్బాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News June 27, 2024

ఎస్జీటీ పోస్టులు పెంచాలని మంత్రికి వినతి

image

నెల్లూరు జిల్లాలో ఎస్జీటీ పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలువురు  దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరులోని ఆయన కార్యాలయంలో కలిశారు. జిల్లాలో టీటీసీ చేసిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారని చెప్పారు. రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య పెరిగేలా చూడాలని కోరారు.

News June 27, 2024

కంచిలి: ఎస్‌బీఐ ఫలితాల్లో యువకుడి ప్రతిభ

image

కంచిలి మండలం చిన్న శ్రీరాంపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన లోళ్ళ కాళీ ప్రశాంత్ గురువారం విడుదలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ ఫలితాలలో ప్రతిభ కనబరిచాడు. ప్రాథమిక, ఉన్నత విద్య గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి ఉన్నత చదువులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ SBIలో ఉద్యోగం సాధించాడు. యువకుడి విజయం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

News June 27, 2024

త్వరలో నామినేటెడ్ పదవులు.. రేసులో ఉన్నదెవరు?

image

త్వరలోనే నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో టికెట్ ఆశించిన భంగపడ్డ పలువురు నేతలకు సైతం అధిష్ఠానం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎవరికి ఏ నామినేటెడ్ పదవి వస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News June 27, 2024

గౌరు చరితా రెడ్డిని కలిసిన సినీ నటుడు రాజకుమార్

image

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులను సినీ నటుడు నటుడు రాజకుమార్ కలిశారు. కర్నూలులోని గౌరు దంపతుల స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై కాసేపు ముచ్చటించారు.

News June 27, 2024

గిద్దలూరు: ఎట్టకేలకు.. చిక్కిన చిరుత

image

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని దేవనగరం గ్రామ సమీపంలోని గోతిలో చిక్కుకున్న చిరుతను 24 గంటలు శ్రమించి ఎట్టకేలకు అధికారులు బంధించారు. ఫీల్డ్ డైరెక్టర్ డీఎన్ఎస్ మూర్తి ఆదేశాల మేరకు చిరుతను అటవీశాఖ అధికారులు గురువారం తరలించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, గ్రామ ప్రజలు ఊపిరిపీల్చుచుకున్నారు.

News June 27, 2024

కడప: 29 న జాతీయ మెగా లోక్ అదాలత్

image

జిల్లావ్యాప్తంగా ఈనెల 29న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జస్టిస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్‌తో సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నట్లు జస్టిస్ శ్రీదేవి తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని, అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 27, 2024

ప్రకాశం: లోక్ అదాలత్‌ సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

image

జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ చేయగలిగిన క్రిమినల్, సివిల్ వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్‌తో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

News June 27, 2024

అనంతపురం: దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఈ నెల 19న టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి చెందారు. మండల పరిధిలోని కోమటికుంట్ల గ్రామంలో ఈ ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్త ఎరుకలయ్య (55)కు త్రీవ గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.