Andhra Pradesh

News June 27, 2024

VZM: షాపులో కాటేసిన పాము.. మహిళ మృతి

image

గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామానికి చెందిన అట్టాడ లక్ష్మి గురువారం పాముకాటుకు గురై మృతి చెందింది. లక్ష్మి గ్రామంలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవన ఉపాధి పొందుతుంది. గురువారం ఎప్పటిలాగే షాపు తెరచి తన పనిలో నిమగ్నమవ్వగా.. అప్పటికే షాపులో ఉన్న పాము లక్ష్మిని కాటు వేసింది. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది.

News June 27, 2024

నెల్లూరులో లాయర్ల ఆందోళన

image

జులై 1 నుంచి అమలు చేయాలనుకుంటున్న మూడు కొత్త క్రిమినల్​ చట్టాలను వాయిదా వేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో లాయర్లు నిరసన తెలిపారు. సీనియర్ లాయర్లు జక్కా శేషమ్మ, DSV ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్త చట్టాల కారణంగా IPC 1973, భారతీయ శిక్షాస్మృతి 1860, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872 రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

News June 27, 2024

పాడేరు: లొంగిపోయిన ఇద్దరు మహిళా మావోయిస్టులు

image

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మడివి గంగి జనజీవన స్రవంతిలో కలిశారని అల్లూరి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా గురువారం తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరు మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడం, పార్టీలో ఆదివాసేతర నాయకుల వివక్షత వల్ల లొంగిపోయారని తెలిపారు.

News June 27, 2024

విశాఖ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖపట్నంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను స్పెషల్ పోక్సో కోర్ట్ న్యాయమూర్తి విధించారు. 2021 సంవత్సరంలో ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల ⁠బాలికపై పక్కింటి వ్యక్తి అప్పన్న అఘాయిత్యం చేశాడు. నిందితుడికి లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ.. బాలికకు రూ.3లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

News June 27, 2024

కవిటి: కేరళలో కరాపాడు వలస కూలీ మృతి

image

కవిటి మండలం జి.కరాపాడ గ్రామానికి చెందిన నర్తు కాళీప్రసాద్ మృతి చెందారు. మృతుడు 4 రోజుల క్రితం కేరళ రాష్ట్రానికి వలస కూలీగా వెళ్లి గురువారం ఉదయం తాను పనిచేస్తున్న చోట పైనుంచి జారిపడి తలకు బలమైన గాయమవ్వడంతో మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు. కాళీప్రసాద్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైందని, ఇంతలోనే ఇలా జరిగే సరికి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News June 27, 2024

చిత్తూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పుంగనూరు, తంబళ్లపల్లెలోనే గెలిచింది. ఈ ఫలితాల నుంచి కోలుకోక ముందే ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. గతంలో రాష్ట్రమంతటా చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఆయన నియోజకవర్గం పుంగనూరులోనే భారీ షాక్ తగిలింది. ఒకేరోజు 12 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. కలికిరి జడ్పీటీసీ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారని సమాచారం.

News June 27, 2024

సుండుపల్లె: పింఛానదిలో పడి బాలుడి మృతి

image

సుండుపల్లె  పింఛా ప్రాజెక్టు నదిలో ప్రమాదవశాత్తూ పడి యశ్వంత్ నాయక్(15)విద్యార్థి మృతి చెందినట్లు ఎస్సై హుస్సేన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు పింఛాకు చెందిన మునె నాయక్ కుమారుడు యశ్వంత్ బుధవారం పింఛానదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయి మృతి చెందాడు. పోలీసులు గురువారం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

News June 27, 2024

టీడీపీపీ సెక్రటరీగా బీకే పార్థసారథి

image

టీడీపీపీ సెక్రటరీగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ లేఖను స్పీకర్ ఓం బిర్లాకు లావు శ్రీకృష్ణ దేవరాయలు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తదితర టీడీపీ ఎంపీలు అందజేశారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఎంపీ పార్థసారథి తెలిపారు.

News June 27, 2024

బాపట్ల జిల్లా అభివృద్ధికి MSMEల పన్నులే కీలకం

image

జిల్లా అభివృద్ధిలో MSMEల పాత్ర కీలకమని బాపట్ల జిల్లా పరిశ్రమల అధికారి రామకృష్ణ చెప్పారు. గురువారం బాపట్ల జిల్లాలో అంతర్జాతీయ సూక్ష్మ, మధ్య తరహా, చిన్న పరిశ్రమల వేడుకలు నిర్వహించారు. జిల్లా అభివృద్ధిలో చిన్న పరిశ్రమల ట్యాక్స్ కీలకంగా మారిందన్నారు. పరిశ్రమల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. బ్యాంకుల ద్వారా రుణాలు అందించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.

News June 27, 2024

AP- IIITలకు ఎంతమంది అప్లై చేశారో తెలుసా?

image

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25వ తేదీకి ముగిసింది. ఈఏడాది 4,400 ప్రవేశాలకు గాను 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల
జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. జులై 22, 23న నూజివీడు, ఇడుపులపాయ,
24, 25న ఒంగోలు, 26, 27న శ్రీకాకుళం IIIT అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది.