Andhra Pradesh

News June 27, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా.. మూహూర్తం ఫిక్స్

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం లాంఛనంగా అధ్యక్ష బాధ్యతల స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు, క్యాబినెట్ మంత్రులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

News June 27, 2024

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు: మంత్రి

image

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. గిరిజనుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండేలా పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్సీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

News June 27, 2024

పెన్షన్ల పంపిణీ లేటైతే చర్యలు: మంత్రి స్వామి

image

పెన్షన్ల పై మంత్రి స్వామి అధికారులకు కీలక సూచనలు చేశారు. వెలగపూడి సచివాలయంలో పెన్షన్ల పంపిణీపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మరో 3 రోజుల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జులై 1వ తేదీ లోపే పింఛన్ల పంపిణీ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. ఇందులో జాప్యం జరిగితే చర్యలు తప్పవన్నారు.

News June 27, 2024

ఉండి నియోజకవర్గానికి కల్కి సినిమా నిర్మాత విరాళం

image

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ‘డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కాగా దీనికి ‘కల్కి 2898AD’ సినీ నిర్మాత అశ్వినీ దత్ రూ.5 లక్షల విరాళం అందించినట్లు RRR తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, రైతులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

News June 27, 2024

ప్ర‌జ‌ల‌కు పారదర్శకమైన సేవాలందించాలి: సృజ‌న

image

అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ప్ర‌జ‌ల‌కు పారదర్శకమైన సేవలందించాలని క‌లెక్ట‌ర్ సృజ‌న అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా నూత‌న క‌లెక్ట‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన సృజ‌న‌ను ఏపీ ఎన్‌జీవో అసోసియేష‌న్ జిల్లా అధ్య‌క్షుడు విద్యాసాగ‌ర్ కార్య‌వ‌ర్గ స‌భ్యులు గురువారం కలిశారు. గతంలో సబ్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు ఎంతగానో స‌హ‌క‌రించార‌న్నారు.

News June 27, 2024

ప్రొద్దుటూరులో దారుణ హత్య.. 3 ముక్కలు చేసి..

image

ప్రొద్దుటూరులో మహేశ్వర్‌రెడ్డిని దారుణంగా హత్య చేసిన కేసులో ముద్దాయి రామచంద్రారెడ్డిని గురువారం త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యసనాలకు లోనైన మృతుడు మహేశ్వర్‌రెడ్డి తనను ఎక్కడ చంపుతాడో ననే భయంతో అతన్ని రామచంద్రారెడ్డి హత్య చేసినట్లు డీఎస్పీ మురళీధర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. మహేశ్వర్‌‌రెడ్డి మృతదేహాన్ని హంతకుడు అత్యంత కర్కశంగా మూడు ముక్కలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

News June 27, 2024

మరో 48 గంటల పాటు శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు

image

ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 48 గంటలు వరకూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గురువారం సాయంత్రం, రాత్రివేళ వర్షాలు జోరందుకోనున్నాయి. ఈ వర్షాలు ఖరీఫ్ పనులకు ఉపకరిస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉంది.

News June 27, 2024

తిరుపతి: డెంటల్ డాక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

image

తిరుపతికి చెందిన ఎం.మౌనిక దగ్గర ఎం.ఆర్.పల్లికి చెందిన డెంటల్ డాక్టర్ పవిత్ర తన ‘సిరి డెంటల్ కేర్’ అభివృద్ధి కోసం ఏప్రిల్ 15, 2019న రూ.5 లక్షలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న డబ్బుకు పవిత్ర చెక్ ఇవ్వగా బ్యాంకులో డబ్బు లేకపోవడంతో మౌనిక కోర్టును ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో తిరుపతి 2వ కోర్టు పవిత్రకు 6 నెలలు జైలు శిక్ష రూ.5 వేలు ఫైన్ ను గురువారం ఖరారు చేసింది.

News June 27, 2024

అద్దంకి: ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న ఆవేశంతో..

image

అద్దంకి మండలం గోవాడ గ్రామంలో యువకుడు ఎలుకల మందు తిన్న విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదన్న ఆవేశంతో ఓ యువకుడు ఎలుకల మందు తాగాడు. అతడు ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఎలుకల మందుని మద్యంలో కలిపి తాగుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. వెంటనే యువకుడిని కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

News June 27, 2024

ప్రభాస్ ‘కల్కి’ మూవీ టీంకు మంత్రి లోకేశ్ కంగ్రాట్స్

image

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సినిమాకు మంచి రివ్యూలు రావడం సంతోషంగా ఉందని, చిత్ర బృందానికి ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, తదితర నటులు, డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నిర్మాత అశ్వినీదత్ తదితరులు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు.