India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీవీఎంసీలో నాలుగు వసంతాలపాటు మేయర్‌గా పదవిని బాధ్యతతో నిర్వర్తించినందుకు చాలా సంతృప్తినిచ్చిందని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి శనివారం ద్వారా తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ నాలుగు సంవత్సరాలలో ఎంతో జఠిలమైన సమస్యలను పరిష్కరించామన్నారు. తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి కార్పొరేటర్‌కు వారి వార్డులో నిధులు కేటాయింపులో ఎటువంటి వివక్షతను చూపలేదన్నారు.
టంగుటూరు మండలం కందులూరు గ్రామానికి చెందిన పైనం మధుబాబు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకి, జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఇంటర్‌లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి 900కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. శనివారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యార్థులతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.
గిరిజన కుటుంబాలకు రూఫ్ టాప్ కింద సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. వారికి ఆయుష్మాన్ భారత్ కార్డులు పెండింగ్ లేకుండా పంపిణీ చేయాలన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద అర్హతలతో గుర్తించబడిన వారికి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల భవనాలకు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలన్నారు.
రణస్థలం మండలం పరిధిలో పైడిభీమవరం పంచాయతీ గొల్లపేటకు చెందిన భవాని(26)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతురాలు పైడిభీమవరంలోని ఓ హోటల్‌లో పని చేస్తుంది. శనివారం సాయంత్రం హోటల్ నుంచి ఇంటికి వస్తుండగా చిన్న చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పదిహేనేళ్లు సీఎంగా, ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ రికార్డే అన్నారు. కీ.శే. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు అన్నారు.
ధర్తి ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో DAJGUA పథకం కింద DLC సమావేశాన్ని నిర్వహించారు. జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన పనులను ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. అమెనియా టెస్ట్ పూర్తి కాని వారికి కిట్స్ ఇవ్వాలన్నారు. వెంటనే స్క్రీనింగ్ టెస్ట్ చేయాలని పేర్కొన్నారు.
అమరావతిలో మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. శనివారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి కలెక్టర్ సమీక్షించారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్లిపర మండలం బొమ్మువారిపాలెంలో జరిగింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో విద్యార్థిని స్వీటీ(16) ఉత్తీర్ణత సాధించింది. అయితే తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
జిల్లాలో పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారిగా పురోగతి సాధించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై జిల్లాలో పీ.ఎం. సూర్య ఘర్ పథకం అమలు పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు 78,766 దరఖాస్తులు రాగా, అందులో 1115 గ్రౌండింగ్ చేయగా, 736 మందికి సబ్సిడీ జమ చేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.