Andhra Pradesh

News June 27, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

అద్దంకి పట్టణంలోని భవాని సెంటర్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో అతణ్ని అంబులెన్స్‌లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సింది.

News June 27, 2024

‘కౌన్సిల్ ఆమోదం లేకుండా పేరు మార్చడం పద్దతి కాదు’

image

పులివెందుల కూరగాయల మార్కెట్‌కు మున్సిపాలిటీ కౌన్సిల్ ఆమోదం లేకుండా కూటమి నాయకులు పేరు మార్చడం సరైన పద్ధతి కాదని మున్సిపల్ ఛైర్మెన్ వరప్రసాద్, వైస్ చైర్మెన్ వైఎస్ మనోహర్ రెడ్డి లు అన్నారు. బుధవారం ఆయన ఇంటి వద్ద మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూరగాయల మార్కెట్‌ను గత ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అప్పట్లో ఉన్న వ్యాపారులు, ప్రజలు మార్కెట‌కు వైఎస్ఆర్ పేరు పెట్టాలని విన్నవించారన్నారు.

News June 27, 2024

రావులపాలెం: కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా ప్రమోషన్

image

రావులపాలెం పట్టణం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్  వైకుంఠరావుకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. 1990లో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన 34 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకోగా ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా సీఐ జేమ్స్ రత్నప్రసాద్, ఇతర సిబ్బంది వైకుంఠరావును అభినందించారు. ఇప్పటివరకు ఆయన సర్వీసులో ఎటువంటి రిమార్క్ లేకుండా పని చేశారని కొనియాడారు.

News June 27, 2024

కడప జిల్లా విజిలెన్స్ ఏఎస్పీగా నీలం పూజిత

image

ఉమ్మడి కడప జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు ఏఎస్పీగా నీలం పూజితను నియమిస్తూ బుధవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నీలం పూజిత గతంలో ప్రొద్దుటూరు డీఎస్పీగా, జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన)గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కర్నూలులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పనిచేస్తూ బదిలీపై జిల్లాకు రానున్నారు. నాలుగైదు రోజుల్లోనే ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

News June 27, 2024

కృష్ణా: రామోజీరావు సభకు వచ్చేవారికి పార్కింగ్ ఎక్కడంటే..

image

అనుమోలు గార్డెన్స్‌లో జరిగే దివంగత రామోజీరావు సంస్మరణ సభకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. A1 గ్యాలరీ ప్రముఖుల వాహనాలు సభాప్రాంగణం సమీపంలోని సిద్దార్థ కాలేజీ, చైతన్య మహిళా కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. B1 గ్యాలరీకి చెందినవారి వాహనాలు కృష్ణవేణి స్కూల్స్ ఆవరణలో, ఇతర వాహనాలు సిద్దార్థ కళాశాల ఆవరణలో పార్క్ చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది.

News June 27, 2024

విజయవాడ: కోరిక తీర్చాలని కూతురికి వేధింపులు

image

విజయవాడలోని పాయకాపురం వాంబేకాలనీలో ఉండే ఓ యువతి(22) డిగ్రీ చదివి, ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. ఆమె తండ్రి తరచూ మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తిస్తూ, కోరిక తీర్చాలని వేధించేవాడు. సోమవారం మరోసారి అతను మద్యం తాగొచ్చి, బట్టలు తీసేసి అసభ్యంగా ప్రవర్తించి, యువతితో గొడవ పడి ఇంటినుంచి వెళ్లిపోమని బెదిరించాడు. మంగళవారం ఇదే విషయంతో కొట్టడానికి ప్రయత్నించగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News June 27, 2024

అనంత జిల్లాలో హంపిలోని రథాన్ని పోలిన మరో రథం ఎక్కడుందో తెలుసా?`

image

అనంతపురం జిల్లాలో హంపిలోని రథం విగ్రహాన్ని పోలిన మరో రథం దర్శనమిస్తోంది. తాడిపత్రిలో వెలసిన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో అడుగు పెట్టగానే హంపీలో పోలిన రథం మనకు దర్శనమిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఆ రథానికి రంధ్రాల నుంచి నేరుగా సూర్యకిరణాలు స్వామి పాదాల చెంతకు చేరడం ఇక్కడ విశిష్టత. అంతేకాకుండా ఆలయం చుట్టూ రామాయణం, మహాభారతం తెలియజేస్తూ శిల్పకళా సంపద ఉంది.

News June 27, 2024

ఆస్పరి మీదుగా వందేభారత్ రైలు

image

ఆస్పరి మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ మీదుగా గురువారం ఉదయం 8 గంటల సమయంలో భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లిందని స్టేషన్ మాస్టర్ తెలిపారు. ఈ రైలు హుబ్లీ మీదుగా గుంతకల్లుకు వెళ్తుందని చెప్పారు. మొదటిసారిగా వందేభారత్ రైలు ఆస్పరి మీదుగా రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News June 27, 2024

పులివెందుల: YSR పేరు తీసేసిన కూటమి నేతలు

image

పురాతన రంగనాథస్వామి ఆలయం ఎదురుగా నిర్మించిన కూరగాయల మార్కెట్ పేరును టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు మార్చారు. వైఎస్సార్ కూరగాయల మార్కెట్ గా ఉన్న పేరును మారుస్తూ బుధవారం రంగనాథస్వామి కూరగాయల మార్కెట్ అని బోర్డు ఏర్పాటు చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులు శశి భూషణ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల కూరగాయల మార్కెట్ కు గత ప్రభుత్వంలో వైఎస్సార్ కూరగాయల మార్కెట్‌గా పేరు పెట్టిందన్నారు.

News June 27, 2024

టాస్క్ ఫోర్స్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ

image

తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తిరుపతి ఎస్పీ, టాస్క్ ఫోర్స్ ఇన్‌ఛార్జి హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఆయనకు టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌ఛార్జ్ కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. అడవుల్లో చేపడుతున్న కూంబింగ్, సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు. కూంబింగ్ ఆపరేషన్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.