Andhra Pradesh

News June 27, 2024

శ్రీకాకుళం: మంత్రి ఆదేశాలు..వచ్చే డిసెంబర్‌కు పూర్తి

image

జిల్లాలోని సాగుకు నీరు అందించే ప్రధాన కాలువల పూడిక తీయకపోవడంతో నీరు అందకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు వ్యయసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. మంత్రి అచ్చెన్న ఆదేశాలతో డిసెంబర్ చివరి నాటికి జిల్లాలోని కాలువలో సాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతామని అధికారులు పేర్కొనారు.

News June 27, 2024

సత్యవేడు: కంటైనర్ ఢీకొని ఇద్దరి మృతి

image

కంటైనర్ ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన బుధవారం ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో చోటు చేసుకుంది. ఎస్సై వీరాంజనేయలు కథనం మేరకు.. సత్యవేడు బీసీ కాలనీకి చెందిన అన్సార్ (37), టి.నీలయ్య (24) తమిళనాడులోని కవర్ పేటలో తాపీ మేస్త్రీ పనులకు వెళ్లారు. తిరిగి బైకులో రాత్రి సత్యవేడుకు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీ కొనడంతో అన్సార్ అక్కడికక్కడే మృతి చెందాడు. నీలయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 27, 2024

తూ.గో: రవాణా శాఖకు రూ.275 కోట్లు ఆదాయం

image

తూర్పు గోదావరి జిల్లాలో వివిధ పన్నులు, ఫీజులు, అపరాధ రుసుముల రూపేనా గత ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.275 కోట్ల ఆదాయం వచ్చింది. వాహన జీవిత కాల పన్నులుగా రూ.113 కోట్లు, క్వార్టర్లీ పన్నులుగా రూ.35 కోట్లు, ఫీజుల రూపేనా రూ.11 కోట్లు, సర్వీస్ ఛార్జీలుగా రూ.27 కోట్లు, వాహన తనిఖీల ద్వారా అపరాధ రుసుము రూపేన రూ.89 కోట్లు ఆదాయం వచ్చిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

News June 27, 2024

నెల్లూరు: ఐటీడీఏ పీవోపై జడ్పీ సీఈవో విచారణ

image

నెల్లూరు ఐటీడీఏ పీవో మందా రాణిపై జడ్పీ సీఈవో కన్నమనాయుడును విచారణ అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లి పీవోపై ఫిర్యాదు చేసిన గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంచలయ్యను విచారించారు. పీవో అవినీతి నిధులు దుర్వినియోగంపై విచారించి శాఖ పరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

News June 27, 2024

యు.కొత్తపల్లిలో 80 కిలోల చేప

image

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లిలోని ఉప్పాడ చేపల రేవులో ఓ వ్యక్తికి 5 అడుగుల పొడవు ఉన్న 80 కిలోల చేప వలలో చిక్కింది. ఇది నల్లమట్ట జాతికి చెందిన చేప అని ..ఇవి చాలా అరుదుగా లభిస్తాయని అన్నారు. దీనికి వేలం నిర్వహించగా ఓ వ్యాపారి రూ.7 వేలకు కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు తెలిపారు.

News June 27, 2024

VZM: మేడమీద నుంచి కిందపడి వ్యక్తి మృతి

image

మెరకముడిదాం మండలం చిన్నమంజిరిపేట గ్రామానికి చెందిన రాగోలు మహేశ్(38) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. బాడంగి మండలంలోని గజరాయునివలస గ్రామంలో ఓ ఇంటికి పెయింటింగ్ వెయ్యడానికి బుధవారం వెళ్లాడు. అక్కడ రెండో అంతస్థులో పెయింటింగ్ వేస్తుండగా తాడు తెగిపోవడంతో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో ఎస్.ఐ జయంతి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News June 27, 2024

పోలవరంలో చిరుత సంచారం

image

పోలవరంలో మండలం వింజరం పంచాయతీలో చిరుతపులి మేకను చంపినట్లు అధికారులు గుర్తించారు. కోటేశ్వరరావు మేకలు మేపుకునే వాడు.అయితే అందులో ఒకటి కనిపించడం లేదని అడవిలో గాలిస్తుండగా బుధవారం కళేబరం కనిపించింది.సమాచారం అందుకున్న అధికారులు పోలవరం పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని , జీవాలను బయటకు వదలొద్దని ఇన్‌ఛార్జ్ రేంజర్ ఎం.దావీద్ రాజ్ తెలిపారు.

News June 27, 2024

విజయవాడ పాస్ పోర్ట్ కార్యాలయానికి అవార్డ్

image

దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి అవార్డ్ దక్కింది. 2023-24లో రికార్డ్ స్థాయిలో 3.75లక్షల మందికి పాస్‌పోర్టులు జారీ చేసినందుకు గానూ అధికారి శివహర్ష 24న అవార్డు అందుకున్నారు. దేశంలోని 37 కార్యాలయాల్లో విజయవాడే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం విజయవాడలో 600 మంది సేవలు అందిస్తున్నట్లు.. త్వరలోనే రోజుకు 1200 మందికి సేవలు విస్తరిస్తామని అధికారులు చెప్పారు.

News June 27, 2024

విజయవాడ పాస్ పోర్ట్ కార్యాలయానికి అవార్డ్

image

దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి అవార్డ్ దక్కింది. 2023-24లో రికార్డ్ స్థాయిలో 3.75లక్షల మందికి పాస్‌పోర్టులు జారీ చేసినందుకు గానూ అధికారి శివహర్ష 24న అవార్డు అందుకున్నారు. దేశంలోని 37 కార్యాలయాల్లో విజయవాడే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం విజయవాడలో 600 మంది సేవలు అందిస్తున్నట్లు.. త్వరలోనే రోజుకు 1200 మందికి సేవలు విస్తరిస్తామని అధికారులు చెప్పారు.

News June 27, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక శాఖ నోటీసులు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తనను ఆర్థిక నష్టానికి గురి చేసిందని కార్మికుడు ఎస్.రామారావు కేంద్ర కార్మిక ఉపాధి శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కార్మిక శాఖ ప్రాంతీయ కమిషనర్ ఉక్కు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 5న రికార్డులతో కార్యాలయంలో హాజరుకావాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.