Andhra Pradesh

News June 27, 2024

140 కేజీల నల్ల రాతి గుండు బలప్రదర్శన పోటీలు

image

పెద్దకడబూరు మండలం మేకడోణలో ఏరువాక ఎద్దుల పండుగ సందర్భంగా 140 కేజీల నల్ల రాతి గుండు బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో వైసీపీ కో ఆప్షన్ మెంబర్ రెడ్డి షేర్ ఖాన్ పటేల్ గెలుపొందారు. పోటీలను చూడటానికి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలతో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండ పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.

News June 27, 2024

అనంత: తండ్రిని చంపిన కొడుకు

image

కూడేరు మండలం కమ్మూరులో బుధవారం తండ్రిని కుమారుడు హత్య చేశాడు. గ్రామానికి చెందిన ఆంజనేయులు(65) మానసిక వ్యాధితో బాధపడుతూ కనిపించిన వారందరినీ తిట్టుకుంటూ తిరిగేవాడు. వారు భరించలేక అతని కుమారుడు తిరుపాల్‌ను మందలించేవారు . ఆవేశానికి గురైన తిరుపాల్ బుధవారం సాయంత్రం తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో గడ్డపారతో తలపై బలంగా కొట్టాడు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతిచెందాడు.

News June 27, 2024

నేటి నుంచి అంతరాష్ట్ర హాకీ పోటీలు

image

ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నుంచి వరకు ఈ నెల 30 వరకు అంతరాష్ట్ర సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనున్నారు. ఈ పోటీలు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు.

News June 27, 2024

ప్రకాశం: బావను హత్య చేసిన బామ్మర్దికి జీవిత ఖైదు

image

బావను హత్య చేసిన బామ్మర్దికి యావజ్జీవ శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ మార్కాపురం కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలం పాపినేనిపల్లిలో 2017లో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని బావ రమణయ్యను బావమరిది శ్రీనివాసులు కత్తితో హతమార్చాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువవ్వడంతో ప్రధాన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెల్లడించారు.

News June 27, 2024

కడప: రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు జులై 1 వరకు గడువు

image

పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈ నెల 27వ తేదీ నుంచి జులై 1వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ మర్రెడ్డి అనురాధ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫీజును హెచ్ఎంకు మాత్రమే సమర్పించాలన్నారు. ప్రతి సబ్జెక్టు జవాబు స్క్రిప్ట్ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుం రూ.500 చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్ కోసం రూ. 1000 చెల్లించాలని తెలిపారు.

News June 27, 2024

కొప్పర్రులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో గ్రీన్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న చంద్రపాల్(55) బుధవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. తాగునీటి సరఫరా సమయంలో రేకుల షెడ్డులో ఉన్న మోటారు వేసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News June 27, 2024

శ్రీకాకుళం: ఇంటర్ సప్లమెంటరీలో 42.84 శాతం ఉత్తీర్ణత

image

ఇంటర్మీడియట్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ జనరల్ కోర్సుల విభాగం నుంచి 7,113 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 3,047 మంది ఉత్తీర్ణులై 42.84 శాతం ఫలితాలు సాధించారు. ఒకేషనల్ విభాగంలో 341 మంది పరీక్షలు హాజరై 174 మంది ఉత్తీర్ణులై 51.03 శాతం ఫలితాలు సాధించారని అధికారలు తెలిపారు.

News June 27, 2024

తలకోన ఆలయ పాలకమండలి రాజీనామా

image

తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు మూకుమ్మడిగా బుధవారం రాజీనామా చేశారు. వైసీపీ పాలనలో 2022 జూన్ 4న ఆలయ ఛైర్మన్‌గా భూమిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, పాలక మండలి సభ్యులుగా నాగిరెడ్డి, మంజుల, సురేశ్, మధుసూదనశెట్టి , రాజేశ్వరిలు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వారు తమ రాజీనామా పత్రాన్ని ఈవో ఎ.జయకుమార్‌కు అందించారు.

News June 27, 2024

ఈనెల 29, 30న ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు

image

ఈనెల 29, 30వ తేదీల్లో నంద్యాల నంది పైప్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ క్రీడ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి వంశీధర్ తెలిపారు. 29న అండర్-11, 13, 15 బాలబాలికలకు సింగిల్స్, డబుల్స్ విభాగంలో, 30న అండర్-17, 19 బాలబాలికల విభాగాలతో పాటు సీనియర్ విభాగంలో పురుషులకు, మహిళలకు సింగిల్స్, డబుల్స్‌లో విడివిడిగా పోటీలు జరుగుతాయన్నారు.

News June 27, 2024

అనంతలో డయేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సరోజన ఆసుపత్రిలో 15 పడకలతో డయేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు సూపర్ హిట్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా డయేరియా కేసులు అధికం అవుతుండటంతో మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. డయేరియా పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.