Andhra Pradesh

News June 27, 2024

గిద్దలూరు: గోతిలో పడిన చిరుత

image

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత ఓ గోతిలో చిక్కుకుపోయింది. అటుగా వెళ్లిన మేకల కాపరులు పులి అరుపులు విని మొదట బయపడ్డారు. తరువాత ధైర్యం చేసి దానిని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గుంతపై వలలు వేసి చిరుత పులి బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చీకటి పడటంతో చిరుతను బంధించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

News June 27, 2024

జలుమూరులో 20 తులాల బంగారు చోరీ

image

జలుమూరు మండలంలోని నగరి కటకంలో జరిగిన చోరీలో 20 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురి అయ్యాయని బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలకు వెళితే స్థానికంగా ఉన్న రేజేటి శ్రీనివాసరావు తన కుమారుడు హైదరాబాదులో అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు కలిసి వెళ్లాడు. తిరిగి బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చేసేసరికి చోరీ జరిగినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 27, 2024

గురుకులాల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోండి: శ్రీదేవి

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతిలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు APSWREIS కో-ఆర్డినేటర్ ఐ.శ్రీదేవి తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆయా పాఠశాలల్లో పొంది ఈ నెల 28వ తేదీ లోగా అదే పాఠశాలల్లో అందజేయాలన్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.

News June 27, 2024

జగన్ ప్రతిపక్ష హోదా కోరడం అర్థరహితం: పల్లా శ్రీనివాస్

image

రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోరడం అర్థరహితమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. శాసనసభలో పదవ వంతు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందన్నారు. దీనిపై లేనిపోని రాద్ధాంతాలు సృష్టించడం సరికాదన్నారు.

News June 27, 2024

నేడే కానూరులో రామోజీరావు సంస్మరణ సభ

image

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ గురువారం నిర్వహించనున్నారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఇందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదిక, 10వేల మంది కూర్చునేలా మూడు భారీ టెంట్లను నిర్మించింది. సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ఠవ్, రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు హాజరుకానున్నారు.

News June 27, 2024

నేడే కానూరులో రామోజీరావు సంస్మరణ సభ

image

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ గురువారం నిర్వహించనున్నారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఇందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదిక, 10వేల మంది కూర్చునేలా మూడు భారీ టెంట్లను నిర్మించింది. సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ఠవ్, రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు హాజరుకానున్నారు.

News June 27, 2024

విశాఖ: వివేక్ ఎక్స్‌ప్రెస్ సేవలు పొడిగింపు

image

ప్రయాణికుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని డిబ్రూఘర్-కన్యాకుమారి-డిబ్రూఘర్ 22504/22503 వివేక్ ఎక్స్ ప్రెస్‌ను ప్రతిరోజూ నడపనున్నట్లు వాల్తేర్ డీసీఎం కే. సందీప్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ రైలు వారానికి ఐదు రోజులు నడిచేది. జులై 8 నుంచి డిబ్రూఘర్- కన్యాకుమారి (22504), జులై 12 నుంచి కన్యాకుమారి – డిబ్రూఘర్ (22503) ప్రతిరోజు నడవనున్నాయి.

News June 27, 2024

కడపలో యువతి ఆత్మహత్య

image

కడప నగరంలోని ప్రకాష్ నగర్‌లో నివాసం ఉంటున్న భాను శ్రీ అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు చిన్న చౌక్ ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. భాను శ్రీ కడప నగర శివార్లలోని బుడ్డాయిపల్లెలో ఉన్న కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. బుధవారం ఉదయం ఓ ఫంక్షన్‌కు వెళ్లే విషయంలో అక్కాచెల్లెళ్లు గొడవ పడడంతో తల్లి భాను శ్రీని మందలించింది. దీంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

News June 27, 2024

గుంటూరు యార్డులో 47,926 బస్తాల మిర్చి విక్రయం

image

గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 44,834 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 47,926 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334. నంబర్-5 273, 341, 4884, సూపర్ 10 మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ. 17,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 20,000 వరకు లభించింది.

News June 27, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులు రాయాల్సిన 5, 6వ సెమిస్టర్ పరీక్షల(అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ) షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు జులై 25 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధరుసుం లేకుండా జులై 6లోపు చెల్లించాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫీజు వివరాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/examinationsection చెక్ చేసుకోవచ్చు.